Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మన దగ్గర క్రీడల్లో రాణించాలంటే కచ్చితంగా కుటుంబ త్యాగం ఉండాల్సిందే!. ఎందరో స్టార్ అథ్లెట్ల విజయగాథలో కనిపించే సహజమైన దీనగాథ ఇదే మరి. ప్రస్తుతం తెలంగాణలోకి హైదరాబాద్ సహా ఇతర మెట్రో నగరాల్లో క్రీడా సంస్కృతి పెంపొందుతోంది. అందుకు అనుగుణంగానే క్రీడలను కెరీర్‌గా ఎంచుకునేందుకు యువత ఆసక్తిగా చూపుతోంది. అయితే, అలాంటి ప్రతిభావంతులకు సహకారం అందించే విషయంలో ప్రభుత్వాలు ఏనాడూ సఫలీకృతమైన దాఖలాలు లేవు. ప్రస్తుత పరిస్థితి పథకాల రూపంలో నయమే కదా అనిపించినా, వాస్తవానికి కడు దుర్భరం!. నాణ్యమైన శిక్షణ, క్రీడా ఉత్ప్రరికరాల ఖర్చు తడిసి మోపెడవుతోంది. కానీ ప్రభుత్వం కష్టాలు ఎదురీది పతకాలు తీసుకొచ్చిన వారికి అక్కున చేర్చుకుని, ప్రచారానికి వాడుకుంటోంది. ప్రోత్సహిస్తే మరిన్ని పతకాలు వస్తాయని తెలిసినా, ఆ పని చేసేందుకు చిత్తశుద్ది సరికదా కనీస లక్ష్య సిద్ధి సైతం లేకపోవటం విచారకరం. ఇక తెలంగాణ నుంచి కేంద్ర క్రీడామంత్రిత్వ శాఖకు చేరిన 15 మంది క్రీడాకారుల జాబితాను పరిశీస్తే, అందరూ వర్థమాన క్రీడాకారులే, భవిష్యత్‌లో పతకాలు తీసుకురాగల సత్తా ఉన్న వారే. వీరెవ్వరికి టాప్ పథకంలో చోటు దక్కలేదు.
ఆ క్రీడాకారుల వివరాలు ఇవిగో..
గోనెల్ల నిహారిక (బాక్సింగ్)
ఘనత : ప్రపంచ జూనియర్ చాంపియన్‌షిప్స్‌లో రజతం, అంతర్జాతీయ స్థాయిలో రెండు సిల్వర్ మెడల్స్
మేఘనా రెడ్డి (జిమ్నాస్టిక్స్)
ఘనత : ఆసియా చాంపియన్‌షిప్స్, జూ.ఆసియా చాంపియన్‌షిప్స్‌లో ప్రాతినిథ్యం
బి. సుమీత్ రెడ్డి (బ్యాడ్మింటన్)
ఘనత : రియో ఒలింపిక్స్‌లో డబుల్స్‌లో ప్రాతినిథ్యం
డి. సాయి రాజ్ (రోయింగ్)
ఘనత : ఆసియా కప్‌లో రజతం, వరల్డ్‌కప్‌లో కాంస్యం
ఐసయ్య రాజేందర్ సనం (ఆర్చరీ)
ఘనత : ఆసియా చాంపియన్‌షిప్స్‌లో మూడు స్వర్ణాలు సహా ఓ సిల్వర్, ఓ కాంస్యం.
ఈ. దీక్షిత (వెయిట్‌లిఫ్టింగ్)
ఘనత : జూనియర్ కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం
బోడ హేమలత (అథ్లెట్)
ఘనత : యూత్ ఒలింపిక్స్‌లో ప్రాతినిథ్యం
సి. సుధాకర్ (టేబుల్ టెన్నిస్)
ఘనత :100 మీ. రేసులో నేషనల్ చాంపియన్
కుమారి ఇరా శర్మ (బ్యాడ్మింటన్)
ఘనత : జూనియర్ నేషనల్ చాంపియన్
ఆర్. నవత (సెపక్తక్రా)
ఘనత : అంతర్జాతీయ స్థాయిలో పలు పతకాలు
ఆర్. స్నేహిత (టేబుల్ టెన్నిస్)
ఘనత : స్లోవేకియా టోర్నీలో మెడలిస్ట్
నికత్ జరీన్ (బాక్సింగ్)
ఘనత : వరల్డ్చాంపియన్షిప్స్లలో రజతం, కాంస్యం
హుస్సాముద్దీన్ (బాక్సింగ్)
ఘనత : బల్గేరియా బాక్సింగ్ టోర్నీలో సిల్వర్ మెడల్
జక్క వైష్ణవి రెడ్డి (బ్యాడ్మింటన్)
ఘనత : బెల్జియం ఇంటర్నేషనల్ టోర్నీ విజేత, వరల్డ్ జూనియర్
చాంపియన్‌షిప్‌లో స్వర్ణం
రష్మిత రాథోర్ (షూటింగ్)
ఘనత : అంతర్జాతీయ టోర్నీల్లో మూడు బంగారు పతకాలు.