Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 2-1తో ఫ్రాన్స్‌పై విజయం
- మెక్సికోను 2-1తో ఓడించి క్వార్టర్స్ చేరిన ఇరాన్
గౌహతి : ఉత్కంఠ పోరులో విజయం స్పెయిన్‌ను వరించింది. చివరి నిమిషం వరకు 1-1తో ఉన్న మ్యాచును పెనాల్టీ గోల్‌తో స్పెయిన్ సారథి ఆబెల్ రూయిజ్ మలుపు తిప్పాడు. ఇరు జట్లు డిఫెన్స్‌లో తడాఖా చూపించటంతో అరగంట వరకు గోల్స్ నమోదు కాలేదు. 34వ నిమిషంలో లెన్ని పింటర్ చేసిన గోల్‌తో ఖాతా తెరచిన ఫ్రాన్స్ 1-0తో ఆధిక్యం సాధించింది. మరో నిమిషంలో తొలి భాగం ముగుస్తుందనగా స్పెయిన్ ఆటగాడు జువన్ మిరండా అద్భుతమైన గోల్ చేసి స్పెయిన్‌కు తొలి గోల్ అందించాడు. 1-1తో ఇరుజట్లు సమంగా ఉన్న తరుణంలో స్పెయిన్ చేసిన పలు గోల్ ప్రయత్నాలను ఫ్రాన్స్ గోల్ కీపర్ యహియా ఫోఫానా సమర్థవంతంగా అడ్డుకున్నాడు. చివరి నిమిషంలో మ్యాచ్ డ్రా అవుతుందని భావించినా.. 90వ నిమిషంలో లభించిన పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలచ టంలో స్పెయిన్ యువ కెరటం రూయిజ్ సఫలమయ్యాడు. 2-1తో ఫ్రాన్స్‌ను ఓడించిన స్పెయిన్ క్వార్టర్ ఫైనల్స్‌కు అర్హత సాధించింది. గోవాలో జరిగిన ప్రీ క్వార్టర్స్ పోరులో 2-1తో ఇరాన్ మెక్సికోపై గెలుపొంది క్వార్టర్స్‌కు చేరుకున్నది. ఆదిలోనే రెండు గోల్స్ చేసిన ఇరాన్ చివరిదాకా ఆధిక్యాన్ని కాపాడుకోవటంలో సఫలమైంది. 7వ నిమిషంలో మహమ్మద్ షర్ఫీ గోల్‌తో శుభారంభం చేసిన ఇరాన్‌కు నాల్గు నిమిషాల వ్యవధిలోనే అల్లాహ్యర్ సయ్యద్ రెండో గోల్ అందించాడు. 37వ నిమిషంలో రాబర్టో డెలా రోజా మెక్సికో తరఫున ఏకైక గోల్ చేశాడు.
అయితే, ద్వితీయార్థంలో మెక్సికో గోల్ ప్రయత్నాలను ధీటుగా అడ్డుకున్న ఇరాన్ ఆధిక్యాన్ని కాపాడుకోగల్గింది. క్వార్టర్స్ సమరంలో ఇరాన్, స్పెయిన్లు ఆదివారం తలపడనున్నాయి. మరో మ్యాచ్‌లో మాలి 5-1తో ఇరాక్‌పై ఘనవిజయం సాధించింది. ఇరాక్‌ను ఆది నుంచే కట్టడి చేసి చివరిదాకా ఆధిక్యం కనబరచింది. ప్రథమార్థంలో డ్రామె 25వ, లస్సన ఎన్డియానె 33వ నిమిషాలలో చేసిన రెండు గోల్స్‌తో 2-0తో ఆధిక్యంలో ఉన్న మాలి, రెండో భాగంలో చెలరేగింది. కొనటే 73వ, కామరా 87వ నిమిషాలలో గోల్స్ కొట్టగా 4-0 ఆధిక్యం మాలి సొంతమైంది. 85వ నిమిషంలో అలీ కరీమ్ ఏకైక గోల్‌తో ఇరాక్ పరువు నిలిపే ప్రయత్నం చేశాడు. అదనపు సమయంలో (94వ నిమిషంలో) తన రెండో గోల్ కొట్టిన లస్సన ఎన్డియానె మాలి గెలుపును మరింత మధురం చేశాడు.
కోల్‌కతలో జరిగిన పోరులో గోల్స్ నమోదు కాకపోగా పెనాల్టీ షూటౌట్ ద్వారా ఫలితం తేలింది. హోరాహోరీ పోరులో ఇంగ్లాండ్, జపాన్‌లు ఒక్కటంటే ఒక్క గోల్ కూడా చేయలేదు, గోల్స్ కోల్పోనూలేదు. నిర్ణీత సమయంలో గోల్స్ చేయలేకపోవటంతో పెనాల్టీ షూటౌట్ నిర్వహించగా 5-3తో ఇంగ్లాండ్ నెగ్గి క్వార్టర్స్‌లో ప్రవేశించింది. సెమీస్‌లో స్థానం కోసం అమెరికాతో ఇంగ్లాండ్ తలపడనున్నది.