Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 2020 ప్రపంచకప్‌కు అర్హత సాధించని వైనం
మిలాన్ (ఇటలీ) : నిన్న అమెరికా, నేడు ఇటలీ .. 2020 ఫిఫా ఫుట్‌బాల్ ప్రపంచకప్‌కు అర్హత సాధించలేకపోయిన అగ్రశ్రేణి జట్లు. నాల్గు సార్లు చాంపియన్ ఇటలీ రానున్న ఫిఫా ప్రపంచకప్‌కు అర్హత సాధించలేకపోవటం, ఫుట్‌బాల్‌లో పెరుగుతున్న పోటీని సూచిస్తుందని చెప్పవచ్చు!. 1958లో చివరగా సాకర్ సంగ్రామానికి దూరమైన ఇటలీ ఆరవై ఏండ్ల తర్వాత మళ్లీ ప్రపంచకప్‌కు దూరమైంది. సోమవారం జరిగిన రెండో దశ ప్లే ఆఫ్ మ్యాచ్‌లో స్వీడెన్‌తో 0-0తో డ్రా చేసుకున్న ఇటలీ.. తత్ఫలితంగా ప్రపంచకప్‌కు దూరమైంది. తొలి దశ ప్లే ఆఫ్స్‌లో ఓ గోల్ కొట్టిన స్వీడెన్ 1-0తో ప్రపంచకప్‌కు అర్హత సాధించింది. స్టార్ ఆటగాళ్లతో కూడిన ఇటలీ మ్యాచ్‌లో ఆధిపత్యం ప్రదర్శించినా, గోల్ చేయటంలో విఫలమైంది. స్థానిక అభిమానుల నడుమ జరిగిన మ్యాచ్‌లోనూ మెరవలేని ఇటలీ ఆటగాళ్లు.. ప్రపంచకప్‌కు చేరుకోనందున అభిమానులకు, దేశ ప్రజలకు క్షమాపణలు తెలిపారు. రష్యాలో జరుగనున్న 2020 ప్రపంచకప్‌తో రికార్డు స్థాయిలో ఆరోసారి వరల్డ్‌కప్‌లో ఆడాలనుకున్న ఇటలీ గోల్ కీపర్ బఫెన్ కన్నీటి పర్యంతం మధ్య సోమవారం మ్యాచ్‌తోనే వీడ్కోలు పలికాడు.