Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టోర్నీ మధ్యలోనే గాయంతో తప్పుకున్న నడాల్
లండన్ : స్పెయిన్ బుల్, వరల్డ్ నెం.1 రఫెల్ నడాల్ ఏటీపీ ఫైనల్స్‌కు దూరమయ్యాడు. మోకాలి గాయంతో పారిస్ మాస్టర్స్‌లో పాల్గొనని నడాల్... ఏడాది ఆఖర్లో టాప్-8 ర్యాంక్ ఆటగాళ్లు తలపడే ఏటీపీ టూర్ ఫైనల్లోకి అడుగుపెట్టాడు. కానీ రౌండ్ రాబిన్ పద్దతిలో తొలి గ్రూప్ మ్యాచ్‌లోనే ఓడిన నడాల్... గాయంతో టోర్నీ నుంచి తప్పుకున్నాడు. తొలి మ్యాచ్‌లో డెవిడ్ గొఫ్ఫిన్ (బెల్జియం) చేతిలో నడాల్ ఓటమిపాలయ్యాడు. 7-6(7-5), 6-7(4-7), 6-4తో డెవిడ్ గెలుపొందాడు. ' నా సీజన్ ముగిసింది. ఇక్కడ ఆడాలని కోరుకున్నా. నా వరకూ గట్టిగానే ప్రయత్నించా. ఆడేందుకు చేయాల్సినది చేశాను. కానీ నేను ఆడేందుకు ఏమాత్రం సిద్ధంగా లేను. నొప్పితో ఆడే శక్తి లభించటం లేదు' అని నడాల్ పేర్కొన్నాడు. గ్రూప్ దశలో నడాల్ ఇంకో మూడు మ్యాచులు ఆడాల్సి ఉన్నది. వారికి వాకోవర్ లభించనున్నది. మరో గ్రూప్‌లో ఉన్న వరల్డ్ నెం.2 రోజర్ ఫెడరర్ తొలి మ్యాచ్‌లో జాక్ సాక్‌పై వరుస సెట్లలో విజయం సాధించి జోరుమీదున్నాడు. నడాల్ నిష్క్రమణతో ఫెడరర్ ఏడో ఏటీపీ ఫైనల్స్ టైటిల్ వేటలో హాట్ ఫేవరేట్‌గా దూసుకెళ్తున్నాడు.