Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ధోని విమర్శకులకు రవిశాస్త్రి ఘాటు సమాధానం
కోల్‌కత : ధోని విమర్శకులపై చీఫ్ కోచ్ రవిశాస్త్రి మరోసారి విరుచుకుపడ్డాడు. రెండు సార్లు ప్రపంచ కప్‌ను భారత్‌కు అందించిన మాజీ సారథిని విమర్శించే వారెవరైనా ఓసారి వెనక్కి తిరిగి తమ కెరీర్ చూసుకోవాలని ఘాటు వ్యాఖ్యలు చేశాడు. వివిఎస్ లక్ష్మణ్, అజిత్ అగార్కర్ సహా పలువురు మాజీ క్రికెటర్లు ధోని టి20 కెరీర్‌ను ప్రశ్నిస్తున్న వేళ అతనికి అండగా ఉండటం జట్టు బాధ్యత అని చెప్పుకొచ్చాడు. ధోని ఆటతీరును మెచ్చుకుంటూ.. మైదానంలో, వికెట్ల వెనుక, బ్యాట్‌తో రాణించే ధోని కన్నా మెరుగైన ఆటగాడు లేడని కితాబిచ్చాడు.