Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లండన్ : సీజన్ ముగింపు ఏటీపీ టోర్నీలో స్విస్ దిగ్గజం రోజర్ ఫెడరర్ విజయాల పరంపర కొనసాగుతున్నది. గురువారం జరిగిన గ్రూప్ పోరులో క్రొయేషియా ఆటగాడు మారిన్ సిలిచ్పై 6(5)-7(7), 6-4, 6-1తో గెలుపొందాడు. మూడు పాయింట్లతో గ్రూప్ బి టాప్లో ఉన్న ఫెడరర్ సిలిచ్ ఖాతాలో మూడో ఓటమి జమ చేశాడు. గ్రూప్ ఏ పోరులో డొమినిక్, కారెనో బుస్టాను 6-3, 3-6, 6-4తో ఓడించాడు.