Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అనుకున్నట్టుగానే తొలి రోజు ఆటకు వరుణుడు తీవ్ర ఆటంకం కలిగించాడు. ఉదయం 9.30 గంటలకు ఆరంభం కావాల్సిన ఆట.. వర్షం రాకతో నాల్గు గంటలు ఆలస్యంగా మొదలైంది. మధ్యాహ్నం మొదలైన మ్యాచ్లో పది ఓవర్లనైనా ముగియక ముందే మళ్లీ వరుణుడు ప్రత్యక్షమయ్యాడు. దీంతో ఆటకు మళ్లీ అంతరాయం. ఆఖరి సెషన్లో పూర్తి ఆట సాగుతుందని ఆశిస్తే, ఈసారి సూర్యుడు తన ప్రతాపం చూపాడు. సూర్యుడు మేఘాల చాటు నుంచి ఎంతకీ రాకపోవటంతో.. వెలుతురు లేమితో ఆటను నిలిపివేశారు. పలు మార్లు అంపైర్లు వెలుతురు స్థాయిని పరీక్షించినా, ఆట సాగే సూచనలు కనిపించలేదు. తొలి రోజు ఆటను 11.5 ఓవర్లకే ముగించారు. తర్వాతి నాల్గు రోజులూ ఉదయం 9 గంటలకు మ్యాచ్ మొదలవ్వనున్నది.