Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గ్రూప్ పోరులో డొమినిక్పై గెలుపు
లండన్ : ఏటీపీ టూర్ ఫైనల్స్‌లో డెవిడ్ గోఫిన్ (బెల్జియం) ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టాడు. గ్రూప్ పోరులో డొమినిక్ థీం (ఆస్ట్రేలియా)పై 6-4, 6-1తో విజయం సాధించాడు. ప్లే ఆఫ్స్‌కు చేరాలంటే గెలిచి తీరాల్సిన మ్యాచ్‌లో డొమినిక్ తడబడ్డాడు. తొలి సెట్ ఆరంభంలో 3-0తో ఆధిక్యంలోనే ఉన్నా.. పుంజుకున్న గోఫిన్ 3-3తో స్కోరు సమం చేయటమే కాక 6-4తో తొలి సెట్ గెల్చుకున్నాడు. ఇక రెండో సెట్లో గోఫిన్కు డొమినిక్ ఏ మాత్రం పోటీనివ్వలేకపోయాడు. మూడు సార్లు సర్వ్ కోల్పోయి 1-6తో సెట్‌నూ కోల్పోయాడు. ఫైనల్లో స్థానం కోసం ఎనమిదో ర్యాంకర్ గోఫిన్ స్విస్ దిగ్గజం ఫెడరర్‌తో తలపడనున్నాడు. శుక్రవారం జరిగిన మరో గ్రూప్ పోరులో అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ)ను జాక్ సాక్ (అమెరికా) 6-4, 1-6, 6-4తో ఓడించి ప్లే ఆఫ్స్ బెర్త్ నిలుపుకున్నాడు.