Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేరళ,కోల్కత తొలి పోరు డ్రా
కొచ్చి : క్రీడాభిమానుల కోసం మరో సూపర్ లీగ్ వచ్చేసింది. ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) నాల్గో సీజన్ శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. ప్రారంభోత్సవ వేడుకల్లో సినీ నటులు సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ నృత్యాలతో అలరించారు. బెంగళూరు ఎఫ్సి, జంషెడ్పూర్ అరంగేట్రం చేస్తున్న లీగ్లో మొత్తం పది జట్లు టైటిల్ పోరులో అభిమానులను అలరించ నున్నాయి. గత సీజన్ విజేత అట్లెటికొ డి కోల్కత, రన్నరప్ కేరళ బ్లాస్టర్స్ల మధ్య జరిగిన తొలి పోరు గోల్ నమోదు కాకపోవడంతో డ్రాగా ముగిసింది.