Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అరంగేట్రంలోనే అస్సాంపై ఐదు వికెట్ల ప్రదర్శన
- గెలుపు దిశగా హైదరాబాద్
గౌహతి : హైదరాబాద్ రంజీకి మరో మహ్మద్ సిరాజ్ దొరికాడు!. అస్సాంతో రంజీ మ్యాచ్‌లో అరంగేట్రం చేసిన మహ్మద్ ముదాసిర్ (5/36)తో అందరి చూపులూ తనవైపుకు తిప్పుకున్నాడు. కండ్లుచెదిరే బౌలింగ్ ప్రదర్శనతో అస్సాం ఇన్నింగ్స్‌ను కుదేల్ చేసిన ముదాసిర్.. హైదరాబాద్‌కు భారీ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కట్టబెట్టాడు. సందీప్ (84), రాయుడు (83) రాణించటంతో తొలుత హైదరాబాద్ 326 పరుగులు చేసింది. ముదాసిర్‌కు తోడు రవికిరణ్ (3/30) విజృంభించటంతో అస్సాం 136 పరుగులకే కుప్పకూలింది. ఫాలోఆన్ ఆడుతున్న అస్సాం రెండో ఇన్నింగ్స్‌లో 36/2తో నిలిచింది. మరో రెండు రోజుల ఆట ఉన్న నేపథ్యంలో ఈ విజయంతో క్వార్టర్ఫైనల్స్పై హైదరాబాద్ కన్నేసింది!.