Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : భారత అగ్రశ్రేణి బ్యాడ్మింటన్ క్రీడాకారుడు కిదాంబి శ్రీకాంత్ మరో సూపర్ సిరీస్ నుంచి తప్పుకున్నాడు. ఇటీవల కండరాల గాయానికి గురైన శ్రీకాంత్ చైనా ఓపెన్‌లో పాల్గొనలేదు. మరో వారం రోజుల విశ్రాంతి అవసరమని వైద్యుల సూచించటంతో ఈ మంగళవారం నుంచి ఆరంభం కానున్న హాంగ్‌కాంగ్ ఓపెన్‌కూ శ్రీకాంత్ దూరమయ్యాడు. గాయాలతో సమీర్ వర్మ, అజరు జయరాంలు సైతం ఆడటం లేదు. ' శ్రీకాంత్ కోలుకున్నాడు. గాయం పూర్తిగా మానింది. కానీ బీడబ్ల్యూఎఫ్ ఫైనల్స్‌కు వంద శాతం ఫిట్‌గా ఉండాలని భావిస్తున్నాడు' అని ఫిజియో సి. కిరణ్ తెలిపాడు.