Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- క్లబ్ క్రికెట్లో దక్షిణాఫ్రికా కుర్రాడు షేన్ సంచలనం
జొహ్నస్‌బర్గ్ : వన్డేల్లో రోహిత్ శర్మ 264 కొడితేనే వావ్ అనేశాం. కానీ దక్షిణాఫ్రికా యువ క్రికెటర్ ఏకంగా 490 పరుగులు సాధిం చాడు. నార్త్‌వెస్ట్ యూనివర్శిటీ పుక్కె క్లబ్ తరఫున షేన్ డాడ్స్వెల్ సరికొత్త రికార్డు నెలకొల్పాడు. 151 బంతులాడిన షేన్ ఏకంగా 57 సిక్సర్లు, 27 ఫోర్లు కొట్టాడు. ప్రతి బంతినీ స్టాండ్స్‌లోకి పంపించిన షేన్.. ప్రత్యర్థి బౌలర్లపై శివాలెత్తాడు. మరో ఆటగాడు రువాన్ 54 బంతుల్లో 104 పరుగులు చేయటంతో నార్త్‌వెస్ట్ వర్శిటీ 50 ఓవర్లలో 3 వికెట్లకు 677 పరుగులు చేసింది. షేన్ ధాటికి ప్రత్యర్థి జట్టులోని నలుగురు బౌలర్లు 100కుపైగా పరుగులు సమర్పించుకున్నారు.