Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఫైనల్లో పాక్‌పై ఘన విజయం
కౌలాలంపూర్ (మలేషియా): అఫ్ఘనిస్థాన్ క్రికెట్ వేగంగా దూసుకొస్తోంది. మహ్మద్ నబీ, రషీద్ ఖాన్ వంటి ఆటగాళ్లు ఐపీఎల్ సహా జాతీయ జట్టు తరఫున ప్రపంచ స్థాయి ప్రదర్శనతో ఆకట్టుకుంటుండగా, ఆ దేశపు తర్వాతి తరం ఆటగాళ్లు చరిత్ర సృష్టించారు. భారత్, శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్థాన్‌లు సహా పది దేశాలు పాల్గొన్న ఆసియా అండర్-19 ప్రపంచకప్‌ను అఫ్ఘనిస్థాన్ కుర్రాళ్లు కైవసం చేసుకున్నారు. టోర్నీలో నిలకడగా రాణించిన అప్ఘాన్ కుర్రాళ్లు ఫైనల్లో ఏకపక్ష విజయంతో టైటిల్‌ను ఎగరేసుకుపోయారు. ఇక్రం ఫైజీ (107 నాటౌట్, 113 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్స్‌లు), రెహమాన్ గుల్ (40) రాణించటంతో తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్ఘాన్ ఏడు వికెట్ల నష్టానికి 248 పరుగులు చేసింది. ముజీబ్ జద్రన్ (5/13), అహ్మద్ (3/18) నిప్పులు చెరగటంతో ఛేదనలో పాకిస్థాన్ 63 పరుగులకే కుప్పకూలింది. పాక్ జట్టులో నలుగురు డకౌట్ సహా తొమ్మిది మంది రెండెంకెల పరుగులు చేయలేదు. 185 పరుగుల భారీ తేడాతో అఫ్ఘనిస్థాన్ ఆసియా అండర్-19 కప్‌ను సొంతం చేసుకున్నది.