Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పుణె : ఢిల్లీ డైనమోస్ ఎఫ్‌సి ఇండియన్ సూపర్ లీగ్‌లో బోణి చేసింది. తొలి పోరులో పుణెపై 3-2తో గెల్చింది. సొంత గడ్డపై జరిగిన తొలి ఐఎస్ఎల్ సమరంలో రెండు గోల్స్ చేసినా..పుణెకు పరాజయం తప్పలేదు. పౌలినో డయాస్ 46వ, లల్లియాంజౌలా ఛాంగ్టే 54వ, మెటియాస్ మిరాబజే 65వ నిమిషాలలో ఢిల్లీ తరఫున గోల్స్ కొట్టారు. ఎమిలియానో ఆల్ఫారో 67వ, మార్కోస్ టేబర్ 95వ నిమిషాలలో పుణె తరఫున గోల్స్ చేశారు. చప్పగా సాగిన ప్రథమార్థంలో ఇరు జట్లు దూకుడు చూపకపోవటంతో అసలు గోల్స్ నమోదు కాలేదు. విరామ నాంతరం తొలి గోల్ కొట్టిన పౌలినో ఢిల్లీకి 1-0 ఆధిక్యానిన్నచ్చాడు. పది నిమిషాల వ్యవధిలోనే ఛాంగ్టే మరో అద్బుతమైన గోల్‌తో ఢిల్లీ ఆధిక్యాన్ని రెండుకు పెంచాడు. మిరాబజే చేసిన మరో గోల్‌తో 3-0 ఆధిక్యంలో ఢిల్లీ నిలిచింది. ఈ సమయంలో ఎమిలియానో ఓ గోల్‌తో పుణె జట్టులో ఆశలు రేకెత్తించాడు. అయితే ఆపై గోల్స్ చేయటానికి పుణె చేసిన ప్రయత్నాలను ఢిల్లీ డిఫెన్సు సమర్థవంతంగా అడ్డుకున్నది. అదనపు సమయంలో ఓ గోల్ కొట్టిన మార్కోస్ పుణె ఓటమి అంతరాన్ని మాత్రమే తగ్గించగలిగాడు.