Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టెన్నిస్ స్టార్‌పై ఇండియాలో చీటింగ్ కేసు
న్యూఢిల్లీ : డోపింగ్ వివాదం నుంచి తేరుకోక ముందే రష్యా సుందరి మరియా షరపోవా మెడకు మరో వివాదం చుట్టుకుంది. మోసం, నేరపూరిత కుట్ర అభియోగాల కింద ఆమెపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే హోమ్‌స్టెడ్ అనే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలెప్మెంట్ సంస్థ 'బ్యాలెట్ బై షరపోవా' అనే పేరుతో ఢిల్లీ నగర శివార్లలోని గుర్గావ్లో విలాసవంతమైన భవంతుల నిర్మాణానికి భారీ మొత్తంలో పెట్టుబడులు సేకరించింది. హోమ్ స్టెడ్కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించిన షరపోవా తన పేరున తలపెట్టిన ప్రాజెక్టును ప్రారంభించేందుకు 2012లో గుర్గావ్కు వచ్చింది. 2013లో కొనుగోలు దారులు కంపెనీకి కోట్లాది రూపాయలు చెల్లించి బుకింగ్స్ చేసుకున్నారు. 2016లోనే పూర్తి కావలిసిన భవనాల నిర్మాణం ఆగిపోవటంతో సదరు కొనుగోలు దారులు కంపెనీపై, షరపోవాపై కేసులు పెట్టారు.