Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులపై సాహా
నాగ్‌పూర్ : అవసరాన్ని బట్టి బ్యాటింగ్ లైనప్‌లో మార్పులు సహజమని టీమ్ఇండియా వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా అన్నారు. ఈడెన్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఏడో, రెండో ఇన్నింగ్స్‌లో ఎనిమిదో స్థానంలో బరిలోకి దిగిన సాహా, వేర్వేరు స్థానాల్లో బ్యాటింగ్ చేయటం వల్ల సమస్య ఏమీ ఉండదని తెలిపాడు. ' ఆరు, ఏడు, ఎనిమిది స్థానం ఏదైనా ఆటతీరులో పెద్దగా మార్పుండదు. ప్రత్యర్థి బౌలర్ల బలాబలాలను బట్టి, సందర్భానుసారం నేను జడేజా స్థానాలు మార్చుకుంటాం. అయితే బ్యాటింగ్ లైనప్‌లో ఏ బ్యాట్స్‌మన్‌కైనా అనువుగా ఉండేది ఆరో స్థానం.' అని తెలిపాడు. తొలి టెస్టులో మరి కొన్ని ఓవర్లకు సమయం ఉంటే గెలుపు సాధ్యమయ్యేదని సాహా అభిప్రాయపడ్డాడు.