Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇండియన్ సూపర్ లీగ్
చెన్నై : తొలిపోరులో ఎఫ్‌సి గోవా చేతిలో ఓడిన చెన్నయన్ ఎఫ్‌సి సొంతగడ్డపై జరిగిన రెండో ఐఎస్ఎల్ మ్యాచ్‌లో ఏకపక్ష విజయం సాధించింది. నార్త్ఈస్ట్ యునైటెడ్ ఎఫ్సిను 3-0తో ఓడించింది. హక్కు నెడియోదత్ 11వ నిమిషంలో ఓ గోల్‌తో ఖాతా తెరవగా, రఫాయెల్ ఆగస్టో 24వ నిమిషంలో మరో గోల్‌తో 2-0 ఆధిక్యంలో చెన్నైని నిలపాడు. హోరాహోరీ పోరు జరిగినా నార్త్ఈస్ట్ గోల్స్ చేయటంలో విఫలమైంది. ద్వితీయార్థంలో మహమ్మద్ రఫీ (84వ నిమిషం) చేసిన గోల్‌తో 3-0 ఆధిక్యం సాధించిన చెన్నై ఒక్క గోల్ కూడా చివరిదాకా డిఫెన్సివ్ ఆట తీరు ప్రదర్శించింది. నేటి పోరులో ఆరంగేట్ర జంషెడ్పూర్, కేరళ బ్లాస్టర్స్‌తో తలపడనున్నది.