Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎనిమిది స్వర్ణాలు
- నేషనల్ షూటింగ్ చాంపియన్‌షిప్స్‌లో మెహూలీ ఘోష్ ఘనత
న్యూఢిల్లీ : బెంగాల్ షూటర్ మెహూలీ ఘోష్ 61వ జాతీయ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో సత్తా చాటింది. టీమ్ ఈవెంట్లలో నాల్గు సహా మొత్తంగా ఎనిమిది పసిడి పతకాలు గురువారం సాధించింది. ఇటీవలే యూత్ ఒలింపిక్స్్కు అర్హత సాధించిన మెహూలీ.. జూనియర్ మహిళల, మహిళల సివిలియన్ సహా జూనియర్ మహిళల సివిలియన్ విభాగాల్లో స్వర్ణాలు దక్కించుకున్నది. మూడు ఈవెంట్లలోనూ ప్రధాన ప్రత్యర్థి ఎలవనిల్ వలరివన్ (గుజరాత్)ను రజత పతకానికి పరిమితం చేసింది. మహిళల యూత్ వ్యక్తిగత విభాగంలోనూ ఘోష్ స్వర్ణం గురిపెట్టింది. టీమ్ ఈవెంట్లలో సైతం గురి తప్పని ఘోష్ అన్ని విభాగాల్లో బంగారు పతకాలు సాధించింది.