Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రెండో అర్హత రౌండ్లో సునాయస విజయం
- ఆస్ట్రేలియా ఓపెన్
మెల్బోర్న్ : సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ ప్రధాన టోర్నీకి భారత టెన్నిస్ ఆటగాడు యుకీ బాంబ్రీ అడుగు దూరంలో నిలిచాడు. శుక్రవారం జరిగిన రెండో అర్హత రౌండ్లో కార్లోస్ టాబెర్నర్ (స్పెయిన్)ను 6-0, 6-2తో ఓడించాడు. తొలి సెట్లో ప్రత్యర్థికి ఒక్క గేమ్కూడా కోల్పోని యుకీ రెండో సెట్లో సైతం ఆధిపత్యాన్ని కొనసాగించాడు. ఆద్యంతం ఏకపక్షంగా సాగిన రెండు సెట్ల పోరును యుకీ గంటలోపే ముగించాడు. ప్రధాన టోర్నీలో అడుగుపెట్టాలంటే యుకీ... పీటర్ పోలంక్సీను ఓడించాల్సి ఉన్నది. ఇదివరకు రెండు సార్లు యుకీ ఆస్ట్రేలియా ఓపెన్ ప్రధాన టోర్నీలో ఆడాడు.
ఇక ఆస్ట్రేలియా ఓపెన్ పురుషుల సింగిల్స్‌లో టాప్ సీడ్‌గా రఫెల్ నడాల్, రెండో సీడ్‌గా రోజర్ ఫెడరర్ నిలిచారు. గాయం కారణంగా గత కొద్ది రోజులగా బరిలో దిగని నొవాక్ జకోవిచ్‌కు 14వ సీడ్ దక్కింది. మహిళల సింగిల్స్‌లో టాప్ సీడ్ క్రీడాకారిణి సిమోన హాలెప్ కాగా రెండో సీడ్‌గా కరొలినా వోజ్నియాకి నిలిచింది. గురువారం తీసిన డ్రా ఆధారంగా.. తొలి పోరులో నడాల్ విక్టర్ బుర్గోస్ (డొమినికన్ రిపబ్లిక్)ను ఢకొీననుండగా, ఫెడరర్ స్లోవేకియా ఆటగాడు అల్జాజ్ బెడెన్‌తో తలపడనున్నాడు. హాలెప్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఐవాతో తలపడనుండగా, వోజ్నియాకి మిహేలతో తలపడనున్నది. రష్యా సుందరి మరియా షరపోవా అన్‌సీడెడ్‌గా బరిలో దిగనున్నది.