Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నడాల్, జకోవిచ్, షరపోవా కూడా
- తొలి రౌండ్లో యుకీ ఔట్
- ఆస్ట్రేలియా ఓపెన్
మెల్బోర్న్ : సీజన్ తొలి గ్రాండ్ స్లామ్ టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్, స్విస్ దిగ్గజం రోజర్ ఫెడరర్ శుభారంభం చేశాడు. తొలి రౌండ్ పోరులో అల్జాజ్ బెడెన్ (స్లోవేనియా)ను వరుస సెట్లలో 6-3, 6-4, 6-3తో మట్టి కరిపించాడు. రెండో రౌండ్లో జాన్ లెనార్డ్ (జర్మనీ)తో తలపడనున్నాడు. గతేడాది రన్నరప్ రఫెల్ నడాల్ (స్పెయిన్) 6-1, 6-1, 6-1తో విక్టర్ బర్గస్ (డొమినిక్ రిపబ్లిక్)ను సునాయసంగా ఓడించి బోణి చేశాడు. రెండో రౌండ్లో టాప్ సీడ్ నడాల్ లియోనార్డో మేయర్ (అర్జెంటీనా)తో తలపడనున్నాడు. 14వ సీడ్‌గా మెల్బోర్న్ బరిలో దిగిన సెర్బియా యోధుడు నొవాక్ జకోవిచ్ తొలి మ్యాచ్‌లో డొనాల్డ్ యంగ్ (అమెరికా)పై 6-1, 6-2, 6-4తో గెలుపొం దాడు. రెండో రౌండ్లో గేల్ మోన్ఫిల్స్ (ఫ్రాన్స్)ను ఢకొీననున్నాడు. వీరే గాక మూడో సీడ్ గ్రిగర్ దిమిత్రోవ్, ఐదో సీడ్ డొమినిక్ థీమ్, డేవిడ్ గొఫిన్, శామ్ ఖుర్రేలు రెండో రౌండ్లో అడుగుపెట్టారు. భారత తరఫున ప్రధాన టోర్నీలో అడుగుపెట్టిన యుకీ బాంబ్రీకి నిరాశ ఎదురైంది. తొలి పోరులో యుకీ.. బాగ్దాటిస్ చేతిలో 6(4)-7(7), 6-4, 6-3తో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించాడు. మహిళల సింగిల్స్‌లో రష్యా సుందరి మరియా షరపోవా తొలి పోరులో 6-1, 6-4తో మరియా (జర్మనీ)పై గెలుపొందింది. టాప్ సీడ్ సిమోన హాలెప్, మూడో సీడ్ గార్బినె ముగురుజ, ఆరో సీడ్ కరోలినా ప్లిస్కోవాలు తొలి మ్యాచ్ విజయాలతో రెండో రౌండ్లో ప్రవేశించారు. వీనస్ విలియమ్స్, స్లోనె స్టీఫెన్స్, క్విటోవాలు తొలి రౌండ్ ఓటములతో ఇంటి ముఖం పట్టారు.