Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రెండో రౌండ్లో 3-0తో మేయర్‌పై విజయం
మెల్బోర్న్ : స్పెయిన్ దిగ్గజం రఫెల్ నడాల్ ఆస్ట్రేలియా ఓపెన్‌లో మూడో రౌండ్ చేరుకున్నాడు. బుధవారం జరిగిన రెండో రౌండ్ మ్యాచ్‌లో అర్జెంటీనా ఆటగాడు లియోనార్డో మేయర్‌ను 6-3, 6-4, 7(7)-6(4)తో వరుస సెట్లలో ఓడించాడు. ప్రీ క్వార్టర్స్‌లో స్థానం కోసం శుక్రవారం డామిర్ జుముర్ (బోస్నియా)తో అమీతుమీ తేల్చుకోనున్నాడు. తొలి రెండు గేముల్లో సునాయసంగా గెలుపొందిన నడాల్‌కు మేయర్ మూడో గేమ్‌లో గట్టి పోటీనిచ్చాడు. గేమ్ అయితే సూపర్ టైబ్రేకర్‌లో రాణించిన నడాల్ మరో గేమ్ అవసరం లేకుండానే మేయర్‌ను ఇంటిబాట పట్టించాడు. నడాల్ సహా సెర్బియా యోధుడు నొవాక్ జకోవిచ్, మూడో సీడ్ గ్రిగర్ దిమిత్రోవ్, నాల్గో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్, ఐదో సీడ్ డొమినిక్ థీమ్ ఆరో సీడ్ మారిన్ సిలిచ్లు తదుపరి రౌండ్ మ్యాచులకి అర్హత సాధించారు. మహిళల సింగిల్స్‌లో అగ్ర క్రీడాకారిణీలందరూ అలవోక విజయాలతో రెండో రౌండ్ మ్యాచుల్లో గెలుపొందారు. టాప్ సీడ్ సిమోన హాలెప్ 7(7)-6(5), 6-1తో అయివాపె నెగ్గింది. మూడో స్పెయిన్ భామ గార్బినె ముగురుజ 6-4, 6-3తో ఫ్రాన్స్ క్రీడాకారిణి జెస్సికా పోంచెట్పై నెగ్గి మూడో రౌండ్లో అడుగుపెట్టింది. ఎలీనా స్విటోలినా, కరోలిన్ వోజ్నియాకిలు సైతం తదుపరి రౌండ్ మ్యాచులకు అర్హత సాధించారు.