Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రెండు టెస్టుల సస్పెన్షన్ ఎత్తివేత
కేప్‌టౌన్ : సఫారీ పేసర్ కగిసో రబాడ ఆస్ట్రేలియాతో మూడో టెస్టులో ఆడనున్నాడు. రెండో టెస్టులో వికెట్ తీసిన తర్వాత స్మిత్‌ను ఢకొీట్టిన రబాడ.. మ్యాచ్ రిఫరీ నుంచి లెవల్ 2 తప్పిదం కింద మూడు డీ మెరిట్ పాయింట్లు పొందాడు. అప్పటికే ఐదు పాయింట్లున్న రబాడ.. ఎనిమిది పాయింట్లతో రెండు టెస్టుల్లో సస్పెన్షన్‌కు గురయ్యాడు. దీనిపై దక్షిణాఫ్రికా అప్పీల్ చేయగా.. ప్రముఖ న్యాయవాది డాలి వాదనలు వినిపించాడు. స్కైప్‌లో సుమారు ఆరు గంటల పాటు విచారణ చేపట్టిన అప్పీల్ కమిషనర్ మైకల్ హెరొన్ సస్పెన్షన్‌ను ఎత్తివేస్తూ తీర్పు చెప్పాడు. రబాడ లెవల్ తప్పిదంతో ఒక డీ మెరిట్ పాయింట్‌తో తప్పించు కున్నాడు. దీంతో గురువారం నుంచి ఆరంభమయ్యే కేప్‌టౌన్ టెస్టుకు రబాడ బరిలోకి దిగబోతున్నాడు.