Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 2019 వరల్డ్ కప్‌కు అర్హత
హరారే : నిలకడగా వైఫల్య యాత్ర కొనసాగిస్తూ తొలిసారి చాంపియన్స్ ట్రోఫీకి దూరమైన వెస్టిండీస్.. చరిత్రలో తొలిసారి ఓ ప్రపంచకప్‌లో లేకుండా పోయే ప్రమాదం నుంచి తప్పించుకున్నది. ఐసీసీ ప్రపంచకప్ క్వాలిఫయర్ లో ముందంజ వేసిన వెస్టిండీస్ 2019 ప్రపంచకప్‌కు అర్హత సాధించింది. స్కాట్లాండ్తో కీలక మ్యాచ్‌ను డక్‌వర్త్ పద్దతిలో గెలుపొందిన విండీస్.. క్వాలిఫయర్ టోర్నీ ఫైనల్లోకి చేరుకున్నది. మిగతా మ్యాచుల ఫలితంతో సంబంధం లేకుండా విండీస్ నేరుగా ప్రపంచకప్‌లోకి ప్రవేశించింది. క్వాలిఫయర్ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కరీబియన్లు 198 పరుగులకే కుప్పకూలారు. ఛేదనలో స్కాట్లాండ్ 35.2 ఓవర్లలో 125/5తో కొనసాగుతోంది. ఈ దశలో మ్యాచ్‌కు వరుణుడు ఆటంకం కల్గించాడు. వర్షం ఆగకపోవటంతో డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో ఐదు పరుగుల తేడాతో విజయం విండీస్ సొంతమైంది. తప్పక నెగ్గాల్సిన మ్యాచ్‌ను నిరాశకు గురైన స్కాట్లాండ్ ప్రపంచకప్ ఆశలు ఆవిరయ్యాయి. మరో ప్రపంచకప్ బెర్త్ కోసం జింబాబ్వే, అఫ్ఘనిస్థాన్, ఐర్లాండ్లూ పోటీ పడుతున్నాయి.