Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వ్యక్తిగత, జట్టు విభాగాల్లో స్వర్ణాలు సొంతం
- జూనియర్ ప్రపంచకప్ షూటింగ్
సిడ్నీ : షూటింగ్లో భారత పతకాల పంట పండుతోంది. మొన్న సీనియర్ ప్రపంచకప్‌లో మనోళ్లు రెచ్చిపోగా, తాజాగా జూనియర్ ప్రపంచకప్‌లోనూ అదే జోరు కొనసాగుతోంది. భారత షూటర్ ఎలవెనిల్ వలరివన్ రెండు స్వర్ణాలు సాధించింది. 10 మీటర్ల మహిళల ఎయిర్ రైఫిల్ విభాగంలో వలరివన్ పసిడి గురి కొట్టింది. 249.8తో ప్రపంచ రికార్డు బద్దలు కొట్టిన వలరివన్ వ్యక్తిగత విభాగం స్వర్ణం సొంతం చేసుకున్నది. శ్రేయాష్ అగర్వాల్, జీనా ఖిట్టాలతో కలిసి జట్టు విభాగంలో వలరివన్ మరో పసిడి షూట్ చేసింది. బార్సు విభాగంలో అర్జున్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్‌లో రెండో ప్రపంచకప్ కాంస్యం కైవసం చేసుకున్నాడు.