Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ఒక్క సూపర్ ఇన్నింగ్స్‌తో సూపర్ స్టార్డమ్ సొంతం చేసుకున్న ఆటగాడు దినేశ్ కార్తీక్. బంగ్లాదేశ్‌పై 8 బంతుల్లోనే 29 పరుగులు బాదిన కార్తీక్ ఫైనల్లో భారత్‌కు అద్భుత విజయాన్ని అందించాడు. తాజా ఐపీఎల్ సీజన్లో కోల్‌కత నైట్‌రైడర్స్‌కు సారథ్యం వహించబోతున్న కార్తీక్.. సొంత రాష్ట్ర ప్రాంఛైజీ తరఫున ఆడాలనే బలీయమైన కోరికను బయటపెట్టాడు. ' మనసులో మాట.. తొలి సీజన్ నుంచే చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడాలని, ఆ జట్టుకు సారథ్యం వహించాలని స్వప్పించాను. పది సీజన్లు ముగిశాయి. కానీ కల నెరవేరలేదు. ఇప్పుడు కోల్‌కత కు నాయకత్వం వహించటం సంతోషంగా ఉంది. కానీ ఐపీఎల్లో చెన్నై తరఫున ఇక ఆడలేనేమోనని అనిపిస్తోంది!. నేను చెన్నైలో పుట్టి, పెరిగాను. కాబట్టి చెన్నై తరఫున ఆడాలనే కోరిక ఉండటం సహజమే. కానీ భవిష్యత్‌లో అటువంటి అవకాశం కనిపించటం లేదు' అని దినేశ్ కార్తీక్ అన్నాడు.