Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిప్పులు చెరిగిన బౌల్ట్, సౌథి
- రాణించిన విలియమ్సన్
- కివీస్‌తో ఇంగ్లాండ్ తొలి టెస్టు
ఆక్లాండ్ : డేనైట్ టెస్టులో ఇంగ్లాండ్‌కు పీడకలి మిగిల్చింది కివీస్. ఓ వైపు ట్రెంట్ బౌల్ట్, మరో వైపు టిమ్ సౌథిలు నిప్పులు చెరగటంతో ఇంగ్లీష్ బ్యాట్స్‌మెన్ తోకముడిచారు. ఓ దశలో 28/9తో అత్యల్ప స్కోరుకే కుప్పకూలేలా కనిపించిన ఇంగ్లాండ్.. మరో 30 పరుగులు జోడించి 58 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ట్రెంట్ బౌల్ట్ (6/32), టిమ్ సౌథి (4/25) ఇద్దరే ఇంగ్లాండ్ భరతం పట్టారు. అలిస్టర్ కుక్ (5), జో రూట్ (0)లను వెన్వెంటనే అవుట్ చేసిన బౌల్ట్ ఇంగ్లాండ్‌కు గట్టి ఝలక్ ఇచ్చాడు. కానీ కొద్దిసేపటికే మలన్ (2), స్టోన్‌మన్ (11), స్టోక్స్ (0), బెయిరిస్టో (0)లు సైతం వికెట్లు కోల్పోయారు. దీంతో 18 పరుగులకే ఇంగ్లాండ్ ప్రధాన బ్యాట్స్‌మెన్‌ను కోల్పోయింది. మోయిన్ అలీ (0), క్రిస్ వోక్స్ (5)లు అదే దారి పట్టారు. ఆఖరి వికెట్‌కు కోవర్టన్ (33) రాణించటంతో ఇంగ్లాండ్ 50 పరుగుల మార్క్ చేరుకున్నది. లేదంటే 30 లోపే చాపచుట్టేసేదే!. 20.4 ఓవర్లలోనే ఇంగ్లాండ్ ఇన్నింగ్స్‌కు శుభం కార్డు పడింది. కివీస్ తరఫున బౌల్ట్, సౌథిలు మినహా మరొకరు బంతి పట్టాల్సిన అవసరం రాలేదు. ఇక కెప్టెన్ కేన్ విలియమ్సన్ (91 నాటౌట్, 177 బంతుల్లో 10 ఫోర్లు, 1 సిక్స్) అజేయ ఇన్నింగ్స్‌తో రాణించటంతో న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 175/3తో కొనసాగుతోంది. నికోలస్ (24) కెప్టెన్‌కు తోడుగా క్రీజులో ఉన్నాడు. ఓపెనర్ రావెల్ (3) ఆరంభంలోనే అవుట్ కాగా.. మరో ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ పునరావృతం కానున్నదా? అనిపించింది. కానీ టామ్ లాథమ్ (26)తో కలిసి విలియమ్సన్ ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్ 117 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.