Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కేప్‌టౌన్ : జాతీయ జట్టుకు ఆడుతున్నప్పుడు డెవిడ్ వార్నర్ భిన్నమైన ఆటగాడు. దూకుడు మైదానంలో లోపలే కాదు వెలుపలా కనిపిస్తోంది. ఇటీవల దక్షిణాఫ్రికాతో రెండో టెస్టు సందర్భంగా ఆ జట్టు వికెట్ కీపర్ క్వింటన్ డికాక్‌తో డ్రెస్సింగ్‌రూమ్ ముందు వార్నర్ ఆగ్రహించిన వీడియోనూ అందరం చూశాం. తర్వాతి రోజు ఆటలో దక్షిణాఫ్రికా అభిమానులు వార్నర్ భార్యను ఉద్దేశించి మాస్క్‌లు ధరించటం, వారితో సఫారీ అధికారి ఒకరు సెల్ఫీ తీసుకోవటం వివాదస్పదమైంది. అప్పట్నుంచి వార్నర్‌ను లక్ష్యంగా చేసుకున్న దక్షిణాఫ్రికా అభిమానులు.. వీలు చిక్కినప్పుడల్లా అతడిపై మాటల యుద్ధానికి దిగుతున్నారు. కేప్‌టౌన్ టెస్టులోనూ అదే సీన్ చోటుచేసుకున్నది. తొలి ఇన్నింగ్స్‌లో డెవిడ్ వార్నర్ (30) వికెట్ కోల్పోయి పెవిలియన్‌కు చేరుకుంటుండగా.. ఓ అభిమాని వార్నర్‌కు దగ్గరకు వచ్చి అతడిని ఉద్దేశించి మాటల యుద్దానికి దిగాడు. దీంతో వెనక్కి తిరిగి చూసిన వార్నర్.. అతడి వైపు కోపంగా వెళ్లేలా కనిపించాడు. కానీ అక్కడున్న భద్రతా సిబ్బంది వార్నర్‌ను సముదాయించాడు. ఆ అభిమాని సైతం అక్కడ్నుంచి జారుకున్నాడు. ఈ సంఘటనలో దక్షిణాఫ్రికా క్రికెట్ ఇంకా స్పందించాల్సి ఉన్నది. ఆస్ట్రేలియా అభిమానులు ఈ వీడియోను సోషల్ మీడి యాలో పెట్టడంతో ఇప్పుడిది వైరల్‌గా మారింది!.
ఆస్ట్రేలియా 245/9
కేప్‌టౌన్ : మూడో టెస్టులో ఆస్ట్రేలియా ఎదురీదుతోంది. సఫారీ పేసర్ల దెబ్బకు ఓ దశలో 175/8తో కష్టాల్లో పడిన కంగారూలు రెండో రోజు ఆట ముగిసే సమయానికి 245/9తో కాస్త మెరుగైన స్థితిలో కొనసాగుతున్నారు. కెరీర్ ఆఖరి సిరీస్‌లో 300 వికెట్ల క్లబ్లో చేసిన మోర్కెల్ (4/87), రబాడ (3/81), ఫిలాండర్ (2/26) నిప్పులు చెరిగారు. ఓపెనర్ బాన్‌క్రాఫ్ట్ (77), ఆఖర్లో నాథన్ లియాన్ (47)లు మాత్రమే ఆకట్టుకునే ప్రదర్శన చేశారు. ఓపెనర్ డీన్ ఎల్గార్ (131 నాటౌట్) అజేయ శతకం సాధించటంతో తొలి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా 311 పరుగులకు ఆలౌటైంది. ఎల్గార్ ఇన్నింగ్స్ సాంతం అజేయంగా నిలిచిన టెస్టు క్రికెట్లో అరుదైన రికార్డు సాధించాడు. ఓ ఇన్నింగ్స్ ఆరంభంలో బ్యాటింగ్కొచ్చి.. అజేయంగా నిలువటం ఎల్గార్‌కు ఇది మూడోసారి. టెస్టు క్రికెట్లో ఈ ఘనత సాధించిన వారిలో ఎల్గార్ రెండో ఆటగాడు కావటం విశేషం. ఆసీస్ కెప్టెన్ స్మిత్ ఐదు క్యాచులతో ఫీల్డింగ్‌లో రికార్డు సాధించాడు.