Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 2021లో 16 టీముల మధ్య టీ-20 ప్రపంచ టోర్నమెంటు
- ఐసీసీ సంచలన నిర్ణయం
నవతెలంగాణ - కోల్‌కతా
క్రికెట్ పోటీల్లో కీలకంగా భావించే ఛాంపి యన్స్ ట్రోఫీ ఇక గతమే.ఈ ట్రోఫీకి బదులుగా 2021లో 16 టీముల మధ్య టీ..20 టోర్నమెంటు నిర్వహించనున్నట్టు ఐసీసీ సంచల నిర్ణయాన్ని ప్రకటించింది.ఇప్పటిదాకా కేవలం ఎనిమిది జట్ల మధ్య జరిగే ఛాంపియన్స్ ట్రోఫీపై ఎన్నో విమ ర్శలు రావటంతో..ఆ ట్రోఫీని రద్దు చేయాలని ఐసీసీ నిర్ణయించింది. కోల్‌కతాలో ఐదురోజుల పాటు జరిగిన ఐసీసీ సమావేశాల్లో భాగంగా పలు అంశా లను చర్చించింది. ఆ వివరాలను ఐసీసీ సీఈఓ డెవ్ రిచర్డ్సన్ మీడియాకు వెల్లడించారు. 1998 నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ మొదలైంది. 2017లో ఇంగ్లాం డ్ లోని వెల్స్ లో చివరి ట్రోఫీ నిర్వహించారు. ప్రస్తు తం ఛాంపియన్స్ ట్రోఫీని రద్దు చేస్తున్న నిర్ణ యానికి ప్రపంచంలోని అన్ని క్రికెట్ బోర్డులు అంగీకరిం చాయని తెలిపారు.అలానే ప్రపంచవ్యాప్తంగా 104 దేశాలకు ఇంటర్నేషనల్ టీ..20 మ్యాచులు ఆడేందుకు ఐసీసీ పచ్చజెండా ఊపింది. కాగా ఇప్పుడు టీ..20 ఆడేందుకు అనుమతి ఉన్నది 18 దేశాలు మాత్రమే. ఇందులో 12 ఫుల్ మెంబర్లతో పాటు స్కాట్లాండ్, నెదర్లాండ్, హాంగ్‌కాంగ్, యూఏఈ,ఒమన్,నేపాల్ ఉన్నాయి.ఈ టోర్నీని భారత్ ఆతిథ్యమివ్వనున్నది. అంతకు ముందు 2020లో టీ..20 ఏడో వరల్డ్ కప్ పోటీలు ఆస్ట్రేలియాలో జరుగుతాయి.
పురుష,మహిళా జట్లకు ప్రత్యేక గుర్తింపు
కొత్తగా ప్రారంభించబోయే టీ..20 ట్రోఫీలో పాల్గొనే 104 దేశాల్లో పురుష,మహిళ జట్లకు ప్రత్యేక గుర్తింపు ఇవ్వనున్నట్టు ఐసీసీ సీఈఓ డెవ్ రిచర్డ్ తెలిపారు.మహిళల టీములకు జులై1,పురుష జట్లకు వచ్చే ఏడాది జనవరిలో ప్రత్యేక గుర్తింపు ఇవ్వనున్నట్టు ఐసీసీ ప్రకటించింది. బాల్ ట్యాంపరింగ్..స్లోజింగ్ పై చర్యలు ఆటగాళ్లు వివాదస్పద వ్యాఖ్యలు, స్లోజింగ్, బాల్ ట్యాంపరింగ్‌కి పాల్పడే వారిపై చర్యలుంటాయని ఐసీసీ వెల్లడించింది.
ప్రపంచకప్‌లో మ్యాచుల తీరు..
48 మ్యాచులు...45 రోజులు..10 టీములు..డై మ్యాచులు..నైట్ మ్యాచులు..
ప్రపంచకప్ 2019 షెడ్యూల్..
జూన్ 5 సౌతంప్టన్ భారత్ ఞ దక్షిణాఫ్రికా
జూన్ 9 ద ఓవల్ భారత్ ఞ ఆస్ట్రేలియా
జూన్ 13 ట్రెంట్ బ్రిజ్ భారత్ ఞ న్యూజిలాండ్
జూన్ 22 ఓల్డ్ట్రాఫోల్డ్ భారత్ ఞ పాకిస్థాన్
జూన్ 27 సౌతంప్టన్ భారత్ ఞ ఆఫ్ఘనిస్థాన్
జూన్ 30 ఎడ్జ్బస్టన్ భారత్ ఞ ఇంగ్లాండ్
జులై 2 ఎడ్జ్బస్టన్ భారత్ ఞ బంగ్లాదేశ్
జులై 6 లీడ్స్ భారత్ ఞ శ్రీలంక
జులై 9 ఎమరాల్డ్ హెడింగ్లే తొలి సెమీ ఫైనల్
జులై 11 ఎగ్జ్బాస్టన్ రెండో సెమిఫైనల్
జులై 14 లార్డ్స్ ఫైనల్