Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సాట్స్ చైర్మెన్‌కు పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ వినతి
నవతెలంగాణ బ్యూరో- హైదరాబాద్
రాజస్థాన్ రాష్ట్రంలోని ఉదరుపూర్‌లో మే మొదటివారంలో జరిగిన ఏషియన్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ పోటీల్లో తెలంగాణ రాష్ట్రానికి చెందిన క్రీడాకారులు ఐదు పతకాలు సాధించారు. వీటిలో రెండు స్వర్ణ పతకాలు, రెండు రజత, ఒక కాంస్య పతకం ఉంది. ఈ సందర్భంగా పతకాలు సాధించిన క్రీడాకారులకు ప్రభుత్వం నుంచి అందాల్సిన ప్రోత్సహక నగదు బహుమతిని అందించాలని తెలంగాణ పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ ప్రతినిధులు సాట్స్ చైర్మెన్ అల్లీపురం వెంకటేశ్వర్‌రెడ్డిని కోరారు. ఈమేరకు బుధవారం పతకాలు సాధించిన క్రీడాకారులతో వారు ఆయనను కలిశారు. ఈ సందర్భంగా పతకాలు సాధించిన క్రీడాకారులను వెంకటేశ్వర్‌రెడ్డి అభినందించారు. త్వరలోనే ప్రభుత్వం నుంచి రావాల్సిన నగదు బహుమతి అందించేలా చర్యలు తీసుకుంటానని వారికి హామీనిచ్చారు. సాట్స్ చైర్మెన్‌ను కలిసిన వారిలో తెలంగాణ పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ నాగరాజ్, తెలంగాణ ఏషియన్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్స్ వి లావణ్యగౌడ్(గోల్డ్ మెడల్), దయానంద్‌గౌడ్( గోల్డ్ మెడల్), డి ప్రవీణ్ యాదవ్ ( సిల్వర్ మెడల్), సయిద్ రబ్బన్ ఖాద్రీ( సిల్వర్ మెడల్), రాఘవేంద్రగౌడ్ ( కాంస్య పతకం) తదితరులు ఉన్నారు.