Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హైదరాబాద్‌తో కోల్‌కత ఢ
- రాజస్థాన్, బెంగళూర్ చావోరేవో
నవతెలంగాణ-హైదరాబాద్
ఐపీఎల్ ప్లే ఆఫ్స్ వేట అంతిమ ఘట్టానికి చేరుకున్నది. తొలిసారి ఐపీఎల్ లీగ్ దశ అంతిమ అంకానికి చేరుకున్నాక.. ప్లే ఆఫ్స్ రేసులో ఏడు జట్లు నిలువటం ఇదే తొలిసారి!. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో గెలిచి నిలిచిన బెంగళూర్.. నేడు చావోరేవో తేల్చుకోనున్నది. నేడు ఉప్పల్ మైదానంలో టేబుల్ టాపర్స్ హైదరాబాద్‌తో కోల్‌కత నైట్‌రైడర్స్ తలపడనున్నది. ఈ మ్యాచ్‌లో కోల్‌కత నెగ్గితే ఎటువంటి సమీకరణాలతో సంబంధం లేకుండా నేరుగా ప్లే ఆఫ్స్‌కు చేరుకుంటుంది. కోల్‌కత ప్రస్తుతం 14 పాయింట్లతో ఉండగా, నెగ్గితే 16 పాయింట్లు సాధిస్తుంది. 18 పాయింట్లతో అగ్రస్థానంలోని హైదరాబాద్ ఫలితం తో సంబంధం లేకుండా టాప్-2లో నిలుస్తుంది. జైపూర్‌లో జరిగే మరో మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూర్, రాజస్థాన్ రాయల్స్ ముఖాముఖి తలపడ నున్నాయి.
రాజస్థాన్, బెంగళూర్లు చెరో 12 పాయింట్లతో ఉన్నాయి. వీటిలో నెగ్గిన జట్టు 14 పాయింట్లతో రేసులో నిలుస్తుంది. ఓడిన జట్టు ఆశలు ఆవిరవుతాయి. బెంగళూర్ సూపర్ జోరుమీదుండగా.. ఫామ్‌లో ఉన్న ఓపెనర్ జోశ్ బట్లర్, స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ సేవలను కోల్పోయిన రాయల్స్ నేడు అండర్‌డాగ్‌గా బరిలోకి దిగుతోంది. సాయంత్రం 4 గంటలకు రాజస్థాన్, బెంగళూర్ తలపడనుండగా.. రాత్రి 8 గంటలకు హైదరాబాద్, కోల్‌కత ఢకొీట్ట నున్నాయి.