Authorization
Mon Jan 19, 2015 06:51 pm
డంగౌ సిటీ: లీగ్ దశలో మెరుపు విజయాలతో అగ్రస్థానంలో నిలిచిన హాకీ ఇండియా అమ్మాయిలు.. అంతిమ పోరు లో నిరాశపరిచారు. ఆదివారం దక్షిణ కొరి యాతో జరిగిన టైటిల్ పోరులో హాకీ ఇండి యా 0-1తో ఓటమిపాలైంది. ఒక్క గోల్ తో భారత్‌పై పైచేయి సాధించిన కొరియా అమ్మాయిలు ఆసియా చాంపియన్‌షిప్స్ విజేతలుగా నిలిచారు. రెండు వైపులా రక్షణాత్మక వ్యూహంతో ఆడటంతో గోల్ చేయటం కష్టసాధ్యమైంది. కానీ ఆట 24వ నిమిషంలో భారత గోల్ పోస్ట్ గోడను కొరియా బద్దలు కొట్టింది. యంగ్సిల్ లీ 24వ నిమిషంలో గోల్ కొట్టి కొరియాను 1-0 ఆధిక్యంలో నిలిపింది. ఆఖరు వరకూ పోరాడినా భారత్ గోల్ చేయలేదు.