Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హర్మన్‌ప్రీత్, మంధాన జట్ల ఢీ
- బరిలో అంతర్జాతీయ స్టార్స్
నవతెలంగాణ-ముంబయి
2017 మహిళల ప్రపంచకప్ భారత క్రికెట్లో అమ్మాయిల క్రికెట్‌పై విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. ఇప్పుడు అదే బాట లో మహిళల క్రికెట్లో సరికొత్త అధ్యాయానికి వాంఖడే వేదిక కాబో తున్నది. మహిళా క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఉమెన్స్ ఐపీఎల్‌కు నేడు తెరలేవనున్నది. పూర్తి స్థాయి ఐపీఎల్‌కు సన్నాహకంగా నేడు మహిళల టీ20 చాలెంజర్ అభిమా నుల ముందుకు రాబోతున్నది. భారత క్రికెట్ స్టార్స్‌తో పాటు అంత ర్జాతీయ సూపర్ స్టార్స్ నేటి అమ్మాయిల ఐపీఎల్లో భాగస్వామ్యం కాబోతున్నారు. ప్రపంచ క్రికెట్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న అమ్మాయిల నేడు మధ్యాహ్నం 2 గంటలకు ఆరంభం కానున్నది.
సమవుజ్జీల సమరం : ప్రయోగత్మకంగా నిర్వహిస్తున్నప్పటికీ ఐపీఎల్ ఉమెన్ చాలెంజర్స్ సమవుజ్జీల సమరం. రెండు వైపులా నాణ్యమైన దేశవాళీ, విలువైన విదేశీ క్రీడాకారిణులకు కొదవ లేదు. ఓ జట్టుకు హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యం వహించబోతుండగా, మరో జట్టుకు స్మృతీ మంధాన నాయకురాలు. ట్రయల్బ్లేజర్స్లో యువ సారథి స్మృతీ మంధాన సహా వికెట్ కీపర్ అలిసా హీలే అత్యంత కీలకం. సుజీ బేట్స్, బెత్ మూనీ, డానియల్ హజెల్లు ఒంటిచేత్తో మ్యాచ్‌ను మలుపు తిప్పగల సమర్థత ఉన్న అమ్మాయిలు. ఇక దీప్తి శర్మ, యువ సంచనలం జెమీమా రొడ్రిగస్ సహా శిఖా పాండే, ఏక్తా బిస్త్, పూనమ్ యాదవ్‌లు ట్రయల్బ్లేజర్స్లో ప్రధాన పోషించబోతు న్నారు. మరోవైపు సూపర్నోవాస్ తరఫున భారీ హిట్టర్లు బరిలో నిలిచారు. స్వతహాగా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ భారీ షాట్లకు పెట్టిం ది పేరు. ఆస్ట్రేలియా దిగ్గజం మెగ్ లానింగ్, వరల్డ్ క్రికెట్ పరుగుల యంత్రం మిథాలీ రాజ్, డానిలె వ్యాట్లు సూపర్నోవాస్ తరఫున ఆడబోతున్న సూపర్ ప్లేయర్స్. ఎలిసీ పెర్రీ, వేద కృష్ణమూర్తి, మేఘనస్కట్, అనుజ పాటిల్, సోఫియా డివైన్లు ప్రభావశీల క్రీడా కారిణిలు. ట్రయల్‌బ్లేజర్స్, సూపర్నోవాస్లలో ఎవరు నెగ్గినా.. ఎగ్జిబిషన్ పోరు ఉత్కంఠగా సాగి అభిమానులను ఉర్రూతలూగిస్తే మహిళల క్రికెట్లో సరికొత్త శకానికి నాంది పడినట్టే లెక్క!.