Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 36 ఏండ్లలో ఇదే అత్యల్పం
- ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్
దుబాయ్ : డిఫెండింగ్ వరల్డ్కప్ చాంపియన్, క్రికెట్ ప్రపంచాన్ని వణికించిన ఆస్ట్రేలియా.. ఇప్పుడు ఐసీసీ ర్యాంకింగ్స్లో 36ఏండ్ల కనిష్టా నికి పడిపోయింది. ఇటీవల ఇంగ్లాండ్ తో వన్డే సిరీస్లో వరుస ఓటములు చవిచూసిన ఆస్ట్రేలియా 102 పాయింట్లతో ఆరో స్థానానికి చేరుకున్నది. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ విజేత పాకిస్థాన్ కంటే దిగువన ఆస్ట్రేలియా నిలిచింది. గత 15 వన్డేల్లో ఆస్ట్రేలియా 13 మ్యాచుల్లో ఓటమిపాలైంది. ఇంగ్లాండ్ అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. భారత్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. బంగ్లాదేశ్ 7వ, శ్రీలంక, 8వ, వెస్టిండీస్ 9వ స్థానాల్లో నిలిచాయి. అఫ్ఘనిస్థాన్ పదో స్థానం సాధించింది.