Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 1-0తో కొరియాపై గెలుపు
నవతెలంగాణ-మాస్కో
ఫిఫా ప్రపంచకప్ మాజీ విజేత, సాకర్ దిగ్గజాలలో ఒకటైన ఫ్రాన్స్‌ను అర్హత మ్యాచుల్లోనే కంగుతినిపించి, ప్రపంచం చూపు తనవైపుకు తిప్పుకున్న స్వీడన్.. రష్యాలో తన వేట జోరుగా ఆరంభించింది. గ్రూప్-ఎఫ్‌లో తొలి మ్యాచ్‌లోనే స్వీడన్ సత్తా చాటింది. ఆసియా స్టార్ దక్షిణ కొరియాపై 1-0తో మెరుపు విజయం సాధించింది. హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో స్వీడన్ కెప్టెన్ గ్రానెక్విస్ట్ పెనాల్టీని గోల్‌గా మలిచి స్వీడన్‌ను సంబురాల్లో ముంచెత్తాడు. ఆకట్టుకునే ప్రదర్శన చేసిన దక్షిణ కొరియా ప్రపంచకప్‌లో గోల్ చేయటంలో విఫలమైంది. కొరియాపై విజయంతో ఫిఫా ప్రపంచకప్‌లో స్వీడన్ తీరని స్వప్నాన్ని సాకారం చేసుకున్నది. 60 ఏండ్లుగా స్వీడన్ ప్రపంచకప్ ఆరంభ మ్యాచ్‌లో విజయమే సాధించలేదు. 1958లో మెక్సికోపై 3-0తో నెగ్గిన స్వీడన్.. అప్పట్నుంచి ఫిఫా ప్రపంచకప్‌లో తొలి మ్యాచ్‌లో ఎన్నడూ గెలుపు రుచి చూడలేదు.
బంతి నియంత్రణలో స్వీడన్‌తో పోటీడని కొరియా.. ఎటాకింగ్, డిఫెన్స్‌లో వెనకబడింది. స్వీడన్ ఏకంగా 15 సార్లు గోల్ ప్రయత్నాలు చేయగా.. నాల్గు సార్లు ఏకంగా గోల్ పోస్ట్‌లోకి చొచ్చుకుపోయేందుకు ప్రయత్నించింది. కానీ కొరియా గోల్ ప్రయత్నాలే ఐదు సార్లు చేయగల్గింది. అందులో ఒకటి కూడా గోల్ పోస్ట్ దిశగా దూసుకెళ్లలేదు. ప్రథమార్థంలో గోల్ నమోదు కాకుండానే ముగియగా.. ద్వితీయార్థం ఆరంభం నుంచే ఉత్కంఠ నెలకొన్నది. కానీ ఆట 65వ నిమిషంలో పెనాల్టీ ఏరియాలో స్వీడన్ కెప్టెన్‌ను అడ్డగించి.. కొరియా తగిన మూల్యం చెల్లించుకున్నది. వీడియో రిఫరల్ ద్వారా పెనాల్టీ సాధించిన గ్రాన్క్వెస్ట్ ఒడుపుగా గోల్ కొట్టాడు. ప్రపంచకప్‌లో స్వీడన్‌కు సూపర్ ఆరంభాన్ని అందించాడు. గ్రూప్-ఎఫ్‌లో స్వీడన్ తన తర్వాతి మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ జర్మనీతో తలపడాల్సి ఉండగా.. దక్షిణ కొరియాతో మెక్సికో ఆడనున్నది.