Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 2-1తో ఇంగ్లాండ్ అదిరే విజయం
- ట్యూనిషియాకు తప్పని పరాభవం
నవతెలంగాణ-మాస్కో
ఇంగ్లాండ్ 'హ్యారీకేన్' ట్యూనీషియాపై విరుచుకుపడింది. డబుల్ గోల్‌తో విజృంభించటంతో ఫిఫా ప్రపంచకప్ తన తొలి గ్రూప్ మ్యాచ్‌లో ట్యూనీషియా పరాభవం పాలైంది. ఇంగ్లాండ్ సారథి, క్లబ్ లెవల్ స్టార్ హ్యారీకేన్ డబుల్ గోల్‌తో ట్యూనీషియాను చిత్తు చేశాడు. దీంతో ఇంగ్లాండ్ ఆరంభ మ్యాచ్‌లో 2-1తో ఘన విజయం సాధించింది. గ్రూప్-జిలో ముందంజ వేసింది. ఆట ఆరంభమైన 11వ నిమిషంలోనే గోల్ కొట్టిన హ్యారీకేన్ ఇంగ్లాండ్‌కు అదిరే ఆరంభాన్ని అందించాడు. కానీ 35వ నిమిషంలో లభించిన పెనాల్టీని ట్యూనీషియా అందిపుచ్చుకున్నది. ఇంగ్లీష్ గోల్కీపర్ను మాయ చేసి పెనాల్టీ గోల్‌తో స్కోరు సమం చేసింది. ప్రథమార్థం ముగిసే సరికి ఇంగ్లాండ్, ట్యూనీషియాలు 1-1తో సమంగా ఉన్నాయి. రెండో అర్థ భాగంలోనూ ఇదే పరిస్థితి. 90 నిమిషాలు పూర్తి కావొచ్చినా.. ఏ మాత్రం మార్పు లేదు. కానీ ఇంజూరీ సమయంలో హ్యారీకేన్ మరోమారు విజృంభించాడు. ఇంజూరి సమయం తొలి నిమిషంలోనే ఇంగ్లాండ్‌కు నమ్మశక్యం కానీ గోల్ కొట్టాడు. ఫిఫా ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్‌కు అదిరే విజయాన్ని అందించాడు. ట్యూనీషియా ఆరుసార్లు ఇంగ్లాండ్ గోల్‌పోస్ట్ పైకి వెళ్లగా.. ఆ పని ఇంగ్లాండ్ 17 సార్లు చేసింది. ఇంగ్లాండ్ తన తర్వాతి మ్యాచ్‌లో పనామాతో ఆడనుండగా..మరో టైటిల్ ఫేవరేట్ బెల్జియంతో ట్యూనీషియా ఆడనున్నది.