Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రొనాల్డో మ్యాజిక్ రిపీట్ ొ1-0తో పోర్చుగల్ గెలుపు
నవతెలంగాణ-మాస్కో
ఫిఫా ప్రపంచకప్‌లో క్రిస్టియానో రొనాల్డో మ్యాజిక్ కొనసాగుతోంది. టోర్నీలో వరుసగా నాల్గో గోల్ కొట్టిన పోర్చుగల్ సూపర్ స్టార్ ప్రపంచకప్‌లో ఆ జట్టును ప్రీ క్వార్టర్స్‌కు చేరువ చేశాడు. మరో వైపు తొలి మ్యాచ్‌లో సెల్ఫ్ గోల్, తాజా మ్యాచ్‌లో రొనాల్డో పోటుతో మొరాకో ఫిఫా ప్రపంచకప్ నుంచి నిష్క్రమించింది. వరుసగా రెండో ఓటమి చవిచూసిన మొరాకో ప్రపంచకప్ నుంచి నిష్క్రమిస్తున్న తొలి జట్టు. గ్రూప్-బిలో స్పెయిన్‌తో మొరాకో ఆఖరి పోరు నామమాత్రమే.
స్పెయిన్‌తో పోరులో రొనాల్డో మూడు గోల్స్ కొట్టినా.. పోర్చుగల్ ఒక్క పాయింట్‌తోనే సరి పెట్టుకున్నది. కానీ మొరాకోతో ఒక్క గోల్‌తోనే అతడు పోర్చుగల్‌కు మూడు పాయింట్లు సాధించాడు. మొరాకో ఫార్వర్డులు దూకుడుగా కదులుతూ వీలైనన్ని గోల్ ప్రయత్నాలు చేసినా.. వాటిని పోర్చుగల్ గోల్‌కీపర్ నిలువరించాడు. ఆట ఆరంభమైన నాల్గో నిమిషంలోనే రొనాల్డో మ్యాజిక్ చేశాడు. వెనక నుంచి దూసుకొచ్చి హెడర్‌తో గోల్ కొట్టిన రొనాల్డో.. పోర్చుగల్‌ను ఆరంభంలోనే 1-0 ఆధిక్యంలో నిలిపాడు. ఈ తర్వాత మొరాకో ఎన్ని దాడులు చేసినా పోర్చుగల్ డిఫెన్స్ సమర్థవంతంగా అడ్డుకున్నది. మొరాకో ఏకంగా 16 సార్లు గోల్ ప్రయత్నాలు చేయగా అందులో నాల్గు సార్లు గోల్ కొట్టినంత పని చేసింది. పోర్చుగల్ గోల్ కీపర్ పార్టికో మెరుపు ప్రదర్శన మొరాకో ప్రపంచకప్ నుంచి నిష్క్రమించేలా చేసింది.