Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇరాన్‌పై 1-0తో గెలుపు
కజన్ ఎరేనా : మాజీ ఛాంపియన్ స్పెయిన్ జట్టు ఇరాన్‌పై కష్టపడి ఒకే ఒక్క గోల్ సాధించి తొలి విజయాన్ని సొంతం చేసుకుంది. బుధవారం అర్ధరాత్రి గ్రూప్-బి మ్యాచ్‌లో ఆసియా జట్టైన ఇరాన్ స్ఫూర్తిదాయకమైన ఆటను ప్రదర్శించింది. దీంతో స్పెయిన్ జట్టు తుదికంటూ పోరాడినా 1-0 మాత్రమే విజయాన్ని సొంతం చేసుకోగల్గింది. 2010 ప్రపంచకప్ ఛాంపియన్ అయిన స్పెయిన్జట్టు పోర్చుగల్‌తో తలపడిన తొలి మ్యాచ్‌లో మాదిరిగా ఈ మ్యాచ్‌లో ఆడలేకపోయింది. పోర్చుగల్‌తో మ్యాచ్ లో ఆ జట్టుపై మూడు గోల్స్చేసిన స్పెయిన్ ఇరాన్‌పై ఒకే ఒక్క గోల్ చేయడం గమనార్హం.
తొలి అర్ధభాగంలో ఇరుజట్లు గోల్స్ చేయడంలో విఫలమవ్వడంతో రెండో అర్ధభాగంలో ఇరుజట్లు పోటాపోటీగా తలపడ్డాయి. ఇరాన్‌కు చెందిన సయీద్ ఎజటొల్లాహి గోల్ చేసినా అది రిఫరీ ఆఫ్‌సైడ్‌గా ప్రకటించడంతో ఇరాన్జట్టుతో పాటు స్టేడియంలోని ఇరానీ అభిమానులందరూ నిరాశకు గురయ్యారు. స్పెయిన్ తరఫున ఒకే ఒక గోల్‌ను ఆ జట్టు స్ట్రయికర్ డిగో కోస్టా సాధించడం విశేషం. రెండో అర్ధభాగం 54వ నిమిషంలో కోస్టా స్పెయిన్ ఆటగాడు అందించిన బంతిని ఇరాన్ ఆటగాడు రమిన్ రాజియాను తప్పించి అత్యద్భుతంగా ఫీడ్గోల్ చేశాడు. దీంతో ఈ ప్రపంచకప్‌లో కోస్టా చేసిన మూడో గోల్ ఇది. ఇంతకుముందు పోర్చుగల్‌పై కోస్టా రెండుగోల్స్ చేశాడు. అట్లాంటికో మాడ్రిడ్ స్ట్రయికర్ అయిన కోస్టా టోర్నీలో మూడోగోల్ సాధించి అత్యధిక గోల్స్ చేసిన జాబితాలో రెండోస్థానంలో కొనసాగుతున్నాడు. ఇరాన్ మిడ్‌ఫీల్డర్ ఒమిద్ ఇబ్రహీమికి రిఫరీ 92వ నిమిషంలో పసుపుకార్డ్ జారీచేశాడు. తొలి అర్ధభాగంలో ఇరాన్జట్టు అత్యద్భుతంగా ఆడింది. బంతిని 49% తన నియం త్రణలోనే అంటిపెట్టుకొని స్పెయిన్‌కు గట్టి పోటీనిచ్చింది. ఇరాన్‌కు తొలి అర్ధభాగంలో గోల్ చేసే అవకాశాలు ఎన్నో లభించినా ఆ జట్టు గోల్‌గా మలచలేకపోయింది. దీంతో గ్రూప్-బిలో పోర్చుగల్, స్పెయిన్లు నాలుగు పాయింట్లతో అగ్రస్థానంలో ఉంటే... ఇరాన్ మూడు పాయింట్లతో మూడోస్థానంలో కొనసాగుతోంది.
అంకెల్లో ఆట
ఇరాన్ స్పెయిన్
0 గోల్స్ 1
22 బంతి నియంత్రణ 78
14 గోల్ ప్రయత్నాలు 14
7 గోల్ టార్గెట్ షాట్స్ 18
2 కార్నర్లు 6
14 ఫౌల్స్ 14
2 పసుపుకార్డులు 0