Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డెన్మార్క్, ఆస్ట్రేలియా చెరో గోల్
సమరఎరేనా (రష్యా) : డెన్మార్క్-ఆస్ట్రేలియా జట్ల మధ్య గ్రూప్-సి మ్యాచ్ 'డ్రా'గా ముగిసింది. గురువారం ఉత్కంఠభరితంగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఇరుజట్లు ఒక్కో గోల్ మాత్రమే నమోదు చేసుకొని (1-1)తో డ్రాతో ముగించాయి. డెన్మార్క్జట్టు తరఫున ఆట ప్రారంభమైన ఏడో నిమిషంలోనే ఆ జట్టు మిడ్‌ఫీల్డర్ క్రిస్టియన్ ఎరిక్సేన్(10) గోల్ సాధించాడు. ఆస్ట్రేలియా ఆటగాళ్ళను తప్పించుకొని ఎరిక్సేన్ ఎడమకాలితో అద్భుతంగా బంతిని ఆసీస్ గోల్‌పోస్ట్‌లోకి కొట్టి డెన్మార్క్‌కు తొలిగోల్ సంపాదించిపెట్టాడు. దీంతో ఆ జట్టు ఆస్ట్రేలియాపై మ్యాచ్ ప్రారంభమైన ఏడు నిమిషాల్లోనే 1-0 గోల్స్ ఆధిక్యాన్ని సాధించి ఆ జట్టును ఒత్తిడికి గురిచేసింది. అనంతరం ఇరుజట్లు తొలి అర్ధభాగంలో గోల్ చేసే ప్రయత్నాలు చేసినా ఫలించకపోవడంతో 38వ నిమిషంలో ఆస్ట్రేలియా మిడ్‌ఫీల్డర్ మిలే జెడినాక్(15) ఓ అద్భుతమైన గోల్ చేసి 1-1తో స్కోర్‌ను సమం చేశాడు. పెనాల్టీ కార్నర్ నుండి వచ్చిన బంతిని ఆసీస్‌కు చెందిన జెడినాక్ డెన్మార్క్ గోల్‌కీపర్ కాస్పర్ షూమఛెల్ను తప్పించి గోల్‌పోస్ట్‌లోకి పంపి అద్భుతంగా గోల్ చేశాడు. దీంతో ఇరుజట్లు తొలి అర్ధభాగం ముగిసేసరికే ఒక్కో గోల్ సాధించి సమంగా నిలిచాయి.
రెండో అర్ధభాగంలోనూ ఇరుజట్లు గోల్‌పోస్టులపై ఎన్ని దాడులు చేసుకున్నా అవి ప్రతికూల ఫలితాలనే ఇచ్చాయి. ఆట 74వ నిమిషంలో ఆసీస్‌కు చెందిన ఆండ్రూ నబోట్ కుడిభుజం నొప్పితో మైదానాన్ని వీడాల్సి వచ్చింది. అతని స్థానంలో టామీ జూరిక్ మైదానంలోకి వచ్చాడు. నిర్ణీత సమయం ముగిసిన అనంతరం మరో మూడు నిమిషాల ఇంజూరీ సమయంలోనూ ఇరుజట్లు గోల్స్ చేయడంలో విఫలమయ్యాయి. దీంతో 1-1 గోల్స్‌తో ఇరుజట్ల మధ్య జరిగిన మ్యాచ్ డ్రాగా ముగిసింది. దీంతో గ్రూప్-సిలో డెన్మార్క్ జట్టు ఒక విజయం, ఒక డ్రాతో 4 పాయింట్లు సాధించి అగ్రస్థానంలో ఉండగా... ఆసీస్ జట్టు రెండు మ్యాచ్‌లు ఆడి ఒక పరాజయం, ఒక డ్రాతో కేవలం ఒక పాయింట్ మాత్రమే సాధించి మూడోస్థానంలో నిలిచింది.
ఇప్పటివరకూ ఇరుజట్లు మూడుసార్లు ముఖాముఖి తలపడ్డాయి. ఇందులో రెండుసార్లు డెన్మార్క్... ఒకసారి ఆస్ట్రేలియా విజయాలను నమోదు చేసుకున్నాయి. ప్రపంచకప్‌లో తొలిసారి ఇరుజట్లు తలపడడం ఇదే ప్రథమం. ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా జట్టు యూరోపియన్ జట్ల చేతిలో ఏడు మ్యాచ్‌లలో ఓటమిపాలైంది. 2010 ప్రపంచకప్‌లో సెర్బియాపై 2-1 గోల్స్ తేడాతో ఒక్క మ్యాచ్‌లో మాత్రమే విజయం సాధించింది. ఆస్ట్రేలియా జట్టు చివరి నాలుగు ప్రపంచకప్‌లలో కనీసం రెండు గోల్స్ వ్యత్యాసంతో ప్రతి మ్యాచ్‌లోనూ ఓటమిపాలుకావ
అంకెల్లో ఆట..
డెన్మార్క్ ఆస్ట్రేలియా
1 గోల్స్ 1
46 బంతి నియంత్రణ 54
9 గోల్ ప్రయత్నాలు 12
4 గోల్ టార్గెట్ షాట్స్ 4
3 కార్నర్లు 5
7 ఫౌల్స్ 5
2 పసుపుకార్డులు 0