Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫ్రాన్స్ చేతిలో పెరూ పరాజయం
- 36 ఏండ్ల తర్వాత ప్రపంచకప్‌లో పెరూ రెండో మ్యాచ్‌నుంచే నిష్క్రమణ
యూకెతారినబర్గ్: ప్రపంచకప్ ఫుట్‌బాల్ మ్యాచులో గ్రూప్‌లో సీలో గురువారం జరిగిన మ్యాచ్‌లో ఫ్రాన్స్ పెరూ జట్టును 1..0 తేడాతో ఓడించింది. అంతకు ముందు జరిగిన ప్రీ క్వార్టర్ ఫైనల్లో బెర్త్ ఖరారు చేసుకున్నది. మరోవైపు మ్యాచ్ ఓడిన పెరూ ప్రీ క్వార్టర్ ఫైనల్ కు చేరే అవకాశాన్ని కోల్పోయింది. పెరూ టీమ్ 36 ఏండ్ల తర్వాత విశ్వకప్ బరిలో దిగింది. ఫ్రాన్స్ తరఫున 34 వ నిమిషంలో 19 ఏండ్ల ఎంబప్పే చాకచక్యంగా గోల్‌పోస్ట్ వరకు తెచ్చి గురిపెట్టి తన్నాడు. అంతే ఫ్రాన్స్‌కు ఆధిక్యత సాధించింది. ఎంబప్పే అందరి కన్నా తక్కువ వయస్సు ఉన్న ప్లేయర్ కావటం విశేషం. అంతకుముందు ఫ్రాన్స్‌కు చెందిన డెవిడ్ ట్రెజోగుఎట్(20 ఏండ్లు..246 రోజులు) గోల్ చేసిన ఘనత ఉన్నది.1978లో అర్జెంటీనా చేతిలో 2..0 ఓటమి తర్వాత ఫ్రాన్స్ ఫుట్‌బాల్ టీం దక్షిణ అమెరికా టీమ్‌లతో తలపడినా..ఓటమి చవిచూడలేదు. అప్పటినుంచి పెరూ 8 మ్యాచ్‌లు ఆడితే..ఒక్క విజయాన్ని సొంతం చేసుకోలేకపోయింది. చివరకి ఇరాన్ కూడా పెరూను ఓడించటం గమనార్హం.