Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : నకిలీ డిగ్రీ సర్టిఫికెట్ సమర్పించి పంజాబ్ పోలీసు విభా గంలో డీఎస్పీగా జాయిన్ అయిన భారత టీ20 కెప్టెన్ హర్మ న్‌ప్రీత్ కౌర్ ఈ విషయంపై స్పందించారు. ' దూర విద్యలో డిగ్రీ పూర్తి చేశాను. ఢిల్లీలో పరీక్షలు రాశాను, హాల్ టికెట్ నెంబర్ రికార్డుల్లో ఉన్నదీ లేనది ఎవ్వరూ చూసుకోరు. నా విషయంలోనూ అదే జరిగింది. పోలీసు విభాగం నుంచి అధి కారిక సమాచారం లేదు' అని హర్మన్‌ప్రీత్ తెలిపింది. రైల్వే విభాగంలో ఓఎస్పీ హోదాలో ఉన్న హర్మన్‌కు అదే ర్యాంక్‌తో పంజాబ్ ప్రభుత్వం పోలీసు డీఎస్పీగా నియమి ంచింది. కానీ నకిలీ సర్టిఫికెట్ వార్తలతో ఆమెను కానిస్టేబుల్ ర్యాంక్‌కు మారుస్తారని వార్తలొచ్చిన సంగతి తెలిసిందే.