Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 2-0తో ఇంగ్లాండ్‌పై గెలుపు
సెయింట్ పీటర్స్బర్గ్ : తొలిసారి ప్రపంచకప్ సాధించాలనే కల భగమైనా.. మూడో స్థానం కోసం జరిగిన పోటీలో గెలుపొందిన రెడ్ డెవిల్స్ ప్రపంచ చరిత్రలో తొలి మెడల్ సాధించింది. మూడో స్థానం కోసం శనివారం జరిగిన మ్యాచ్‌లో సెమీఫైనల్లో ఓడిన బెల్జియం, ఇంగ్లాండ్‌లు తలపడ్డాయి. ఫేవరేట్‌గా బరిలోకి దిగిన బెల్జియం 2-0తో గెలుపొందింది. ఆట ఆరంభమైన ఐదు నిమిషాల్లోపే గోల్ కొట్టిన బెల్జియం మ్యాచ్‌పై ఆధిపత్యం చెలాయించింది. నిషేధంతో సెమీస్‌లో ఆడని మ్యూనీర్ ఇంగ్లాండ్‌పై చెలరేగాడు. 4వ నిమిషంలోనే గోల్ కొట్టి ఔరా అనిపించాడు. ఆట ఆఖర్లో ఎడెన్ హజార్డ్ (82వ నిమిషంలో) మరో గోల్‌తో బెల్జియం ఆధిక్యాన్ని 2-0కు పెంచాడు. ఇంగ్లాండ్ స్టార్ హ్యారీకేన్ గోల్ కొట్టడంలో విఫలమయ్యాడు.