Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వరల్డ్ జూనియర్ చాంప్ హిమదాస్
కోల్‌కత : ' మీరంత నిద్రపోతుండగా.. నేను ప్రపంచాన్ని ఊపేశాను' ఇదీ 400 మీ పరుగులో వాయు వేగంతో పరుగెత్తి ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన తర్వాత హిమ దాస్ తండ్రితో మాట్లాడిన తొలి మాట. నీపరుగు కోసం అందరం మేల్కోని టీవీ చూస్తున్నామని చెప్పగానే హిమ కంటతడి పెట్టిందని ఆమె తండ్రి రంజిత్ దాస్ భావోద్వేగానికి లోనయ్యాడు. అసోం అమ్మాయి ప్రపంచ చాంపియన్‌గా నిలువటంతో స్థానికులు సంబరపడుతున్నారు. వరి పొలాల్లో పరుగు ప్రాక్టీస్ చేసిన నేపథ్యమే కాదు భారత నయా స్ప్రింట్ స్టార్‌కు సామాజిక ఉద్యమం నేపథ్యమూ ఉంది. 'హిమ ధైర్యవం తురాలు. ఏదైనా చేయగలదు. చట్టవిరుద్ధ పనులకు వ్యతిరేకంగా మాట్లాడేందుకు ఎన్నడూ భయపడలేదు. చుట్టుప్రక్కల గ్రామాల్లో బెల్టు షాపులు మూసివేసేందుకు హిమ ముందుండి పోరాడింది. అందుకే హిమ మాకు మాత్రమే కాదు దేశానికి రోల్ మోడల్' అని అక్కడి ప్రజలు గర్వంతో చెబుతున్నారు.