Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కోర్టులో స్టోక్స్‌పై ప్రతివాది
లండన్ : ఇంగ్లాండ్ స్టార్ ఆల్‌రౌండర్‌కు వ్యతిరేకంగా కోర్టులో ఉచ్చు బిగుసుకుంటోంది!. బ్రిస్టోల్ బారు బయట వీధి గొడవలో ఇప్పటికే ప్రతివాది, మాజీ సైనికుడు రియాన్ హలెపై ఆరోపణలను కొట్టివేసిన న్యాయస్థానం... స్టోక్స్ గొడవకు దిగిన వైనాన్ని విచారిస్తోంది. గురువారం కోర్టులో సాక్షం చెప్పిన రియాన్ హలె.. ఇంగ్లాండ్ క్రికెటర్ పిడి గుద్దుల వర్షంపై పెదవి విప్పాడు. ' నేను తండ్రిని, స్టోక్స్ నా ప్రాణాలు తీసేవాడే. అతడు ఎందుకు ఘర్షణ పడుతున్నాడో, ఎందుకు ఆపకుండా పిడి గుద్దుల వర్షం కురిపిస్తున్నాడో అర్థం కాలేదు. ఎదుటి వ్యక్తికి ఎటువంటి కీడు తలపెట్టకపోయినా, అతడు ఈ విధంగా గొడవ పడటం ఆశ్చర్యానికి గురి చేసింది' అని రియాన్ న్యాయమూర్తితో చెప్పాడు. తన స్నేహితులు స్వలింగ సంపర్కులనే ఏకైక కారణంతో స్టోక్స్ మాపై విరుచుకుపడ్డాడని రియాన్ చెప్పుకొచ్చాడు. మరో సీసీటీవీ ఫుటేజీలో రియాన్ హలె ఇనుప రాడ్ పట్టుకుని స్టోక్స్పైకి దూసుకెళ్తున్నట్టు కనిపించటం కేసులో కీలక మలుపుకు కారణమయ్యే అవకాశం లేకపోలేదు!.