Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మోయిన్ అలీ ఆత్మకథలో కొత్త కోణం
- ఆరా తీస్తోన్న క్రికెట్ ఆస్ట్రేలియా
లండన్ : ఇంగ్లాండ్ ఆల్రౌండర్ మోయిన్ అలీ ఆత్మకథ ఇప్పుడు ఆస్ట్రేలియా క్రికెట్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. వచ్చే నెలలో విడుదల కానున్న మోయిన్ అలీ ఆత్మకథ పుస్తకంలో ఓ విషయం వెల్లడించాడు. 2015 యాషెస్ సిరీస్లో ఓ ఆస్ట్రేలియా ఆటగాడు తనను ఇస్లామిక్ ఉగ్రవాది 'ఒసామా బిన్ లాడెన్' పేరుతో ఒసామా అని పిలిచాడని ఆత్మకథలో అలీ రాసుకున్నారు. దీంతో ఈ విషయంపై క్రికెట్ ఆస్ట్రేలియా ఉలిక్కి పడింది. అత్యంత తీవ్రమైన జాత్యంహకార వ్యాఖ్యలుగా పరిగణిస్తున్న ఒసామా పిలుపుపై, మోయిన్ అలీ నుంచి సీఏ మరింత సమాచారం కోరేందుకు సిద్ధమవుతోంది!. ' ఓ ఆస్ట్రేలియా ఆటగాడు మైదానంలో నా వైపుగా వచ్చి, అది తీసుకో ఒసామా అన్నాడు. నేను ఏం విన్నానో ఒక్కసారిగా నమ్మలేకపోయాను. నా ఆగ్రహం ఇప్పటికీ గుర్తుంది. మైదానంలో నేను ఎన్నడూ అంత కోపంగా లేను. ఈ విషయాన్ని కొంతమందితో చెప్పాను. ఇంగ్లాండ్ కోచ్ ట్రెవర్ బేలిస్ దీన్ని ఆసీస్ కోచ్ డారెన్ లీమన్తో ప్రస్తావించారు. లీమన్ సదరు ఆటగాడిగా అడుగగా, అతడు అంగీ కరించలేదు. నేను అలా అనలేదు. అది తీసుకో, పార్ట్ టైమర్ అని అన్నాడని చెప్పాడట!. అతడి మాటలను నేను పరిగణనలోకి తీసుకోవాల్సి వచ్చినా, ఆ టెస్టు ఆసాంతం నేను ఆగ్రహంగానే ఉన్నాను' అని మోయిన్ అలీ ఆత్మకథలో రాసుకున్నారు. ఆ మ్యాచ్లో 92 పరుగులు సహా ఐదు వికెట్లు కూల్చిన మోయిన్ అలీ ఇంగ్లాండ్ విజయంలో కీలక భూమిక వహించాడు. దీనిపై క్రికెట్ ఆస్ట్రేలియా స్పందించింది. ' ఇటువంటి వ్యాఖ్యలు ఏమాత్రం అంగీకారం కాదు. క్రికెట్లోనే కాదు సమాజంలోనూ దానికి చోటు లేదు. దేశా నికి ప్రాతి నిథ్యం వహిస్తున్నప్పుడు ప్రవర్తన నియామవళికి సంబంధించి సీఏకు స్పష్టమైన మార్గదర్శకాలు ఉన్నాయి. మోయిన్ అలీ చెప్పిన విషయాన్ని చాలా సీరియ స్గా పరిగణిస్తున్నాం' అని క్రికెట్ ఆస్ట్రేలియా అధికారి ఒకరు పేర్కొన్నారు.