Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీసీసీఐ, స్టార్ల మాటల యుద్ధం
దుబాయ్ : ఆసియా క్రికెట్ ప్రతిష్టాత్మక ఆసియా కప్‌కు భారత కెప్టెన్ విరాట్ కోహ్లి విశ్రాంతి తీసుకున్నాడు. సుదీర్ఘ షెడ్యూల్ తర్వాత విరాట్‌కు విశ్రాంతి అవసరమని బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నది. కానీ విరాట్ కోహ్లికి ఆసియా కప్ నుంచి విశ్రాంతి ఇవ్వటం పట్ల ఆసియా కప్ ప్రసారదారు 'స్టార్' గ్రూప్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఇదే విషయాన్ని ఆసియా క్రికెట్ కౌన్సిల్‌కు ఈమెయిల్లో తెలియజేసింది. విరాట్ కోహ్లి ప్రపంచ క్రికెట్ సూపర్ స్టార్. అతడు ఈ టోర్నీలో లేకపోవటం ఆసియా కప్‌ను వాణిజ్యపరంగా దెబ్బతీస్తోంది. కమర్షియల్ విలువ తగ్గేందుకు కారణమవుతోంది. కోహ్లి బ్యాటింగ్ చేస్తున్నప్పుడు వీక్షకుల సంఖ్య అత్యధిక స్థాయిలో ఉంటుంది. ఇప్పుడు అతడు లేకపోవటం టోర్నీ విలువను తగ్గించటమే కాకుండా, అత్యుత్తమ జట్టును పంపకుండా ఒప్పంద విలువను అతిక్రమించారని స్టార్ ఆరోపించింది. దీనిపై భారత క్రికెట్ వర్గాలు ఘాటుగానే స్పందించాయి. బీసీసీఐ అంతర్గత ఎంపిక విషయాల్లో ప్రసారదారు జోక్యం ఏమిటని ప్రశ్నిస్తోంది. ఇక ఓ అడుగు ముందుకేసిన స్టార్.. స్వదేశంలో విండీస్‌లో జరిగే సిరీస్‌లో కోహ్లికి బీసీసీఐ విశ్రాంతి ఇచ్చే సాహసం చేస్తుందా? అని ప్రశ్నించింది. ఈ విషయంపై బీసీసీఐ సీఈవో రాహుల్ జోహ్రీ అధికారికంగా ఆసియా క్రికెట్ కౌన్సిల్ వద్ద ప్రస్తావించే అవకాశం కనిపిస్తోంది!.