Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అఫ్ఘనిస్థాన్ 249 ఆలౌట్
దుబాయ్ : గ్రూప్ దశ దాటాలంటే కచ్చితంగా నెగ్గాల్సిన మ్యాచ్లో శ్రీలంక కష్టాల్లో పడింది!. గ్రూప్ దశలో అఫ్ఘనిస్థాన్ తొలి మ్యాచ్లోనే ఆకట్టుకున్నది. తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్ఘాన్ నిర్ణీత ఓవర్లలో 249 పరుగులు చేసింది. రహమత్ షా (72, 90 బంతుల్లో 5 ఫోర్లు), జనత్ (45, 65 బంతుల్లో 6 ఫోర్లు), షాహిది (37, 52 బంతుల్లో 2 ఫోర్లు), షెహజాద్ (34, 47 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. తిశార పెరీరా (5/55) ఐదు వికెట్ల ప్రదర్శనతో అదరగొట్టాడు. తొలి మ్యాచ్లో బంగ్లా చేతిలో 137 పరుతుల భారీ తేడాతో ఓడిన శ్రీలంక ఈ మ్యాచ్లో నెగ్గకపోతే ఆసియా కప్ నుంచి నిష్క్రమించాల్సి ఉంటుంది.