Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 136 పరుగుల తేడాతో గెలుపు
దుబాయ్: ఆసియాకప్‌లో ఊహించని విజయాలు క్రీడాభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. గురువారం బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో అఫ్ఘానిస్తాన్ విజయాన్ని నమోదు చేసుకున్నది.ఏకంగా 136పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌ను ఓడించింది. అంతకుముందు బ్యాటింగ్‌కు దిగిన అఫ్ఘానిస్తాన్ నిర్ణీత 50ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 255పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన బంగ్లా ఆరంభంలోనే వరుస వికెట్లు కోల్పోతూ పీకల్లోతు కష్టాల్లో పడింది. మరోవైపు అఫ్ఘాన్ బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు పడగొట్టడంతో బంగ్లాదేశ్ 42.1ఓవర్లలో 119పరుగులకే ఆలౌటైంది. అఫ్ఘాన్ బౌలర్లలో ముజీబ్, గుల్బదిన్, రషీద్ తలో రెండు వికెట్లు పడగొట్టారు.