Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేటినుంచి 5వ ఆసియన్ ఛాంపియన్ ట్రోఫీ హాకీ
ఆరు దేశాల ఆసియన్ ఛాంపియన్స్ షిప్ హాకీ టోర్నమెంట్ ఓమన్‌లోని మస్కట్‌లో శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. భారతజట్టు డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతోంది. మిడ్‌ఫీల్డర్ మన్‌ప్రీత్‌సింగ్ సారథ్యంలో టీమిండియా ప్రపంచ ర్యాంకింగ్స్ ఐదోస్థానంతో టైటిల్ ఫేవరేట్‌గా బరిలోకి దిగి తొలిమ్యాచ్ నేడు ఆతిథ్య ఒమన్‌తో తలపడనుంది.
మస్కట్: ఆరు దేశాల 5వ హీరో ఆసియన్ ఛాంపియన్ ట్రోఫీ శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నది. 18మంది సభ్యుల జట్టుకు మిడ్‌ఫీల్డర్ మన్‌ప్రీత్‌సింగ్ సారథ్యం వహించనుండగా... టోర్నీలో భారత్ డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరి లోకి దిగుతోంది. ఆసియా ఖండానికి చెందిన ఒమన్, మలేషియా, పాకిస్తాన్, దక్షిణకొరియా, జపాన్‌లు ఈసారి ఐదో ఆసియా ఛాంపియన్షిప్ హాకీటోర్నీలో బరిలోకి దిగుతున్నాయి. భారత జట్టు తొలిమ్యాచ్‌లో ఆతిథ్య ఓమన్‌తో సుల్తాన్ ఖబూస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో నేడు తొలిమ్యాచ్‌లో తలపడనున్నది. టోర్నీలో బరిలోకి దిగే మిగతా జట్లతో పోల్చుకుంటే భారత్‌కు ఐదో ర్యాంక్‌తో బరిలోకి దిగుతోంది.
2014లో జరిగిన 17వ ఆసియా క్రీడల్లో భారతజట్టు ఓమన్‌పై 7-0 గోల్స్ తేడాతో గెలిచింది. కోచ్ హరీందర్ సింగ్ మాట్లాడుతూ.. టోర్నీ ఒమన్‌లో జరుగుతున్నందున స్వంత అభి మానులమధ్య ప్రత్యర్ధి జట్టు రెట్టించిన ఉత్సాహం తో ఆడే అవకాశముందని దీంతో ఆ జట్టును ఏమాత్రం తేలికగా తీసుకోవద్దని బరిలోకి దిగవద్దని ఆటగాళ్లను హెచ్చరించారు. టోర్నీలో బరిలోకి దిగే ఇతర జట్లతో పోల్చిచూస్తే ఒమన్ ర్యాంక్ అట్టడుగన ఉంది. అయినా ఒమన్ స్వంత అభిమానుల బలం ఆ జట్టుకు పుష్కలంగా ఉందని ఈ మ్యాచ్‌ను సీరియస్‌గానే తీసుకోవా లని కోరారు. తొలిమ్యాచ్‌లో భారీ విజయంతో పాటు టైటిల్ చేజిక్కించుకోవడం తమ ముం దున్న ప్రధాన లక్ష్యమని చెప్పారు. రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో జరిగే ఈ టోర్నీలో ప్రతి జట్టూ ఇతర జట్లతో ఒక్కోసారి తలపడి అగ్రస్థానంలో నిలిచిన రెండుజట్లు సెమీస్‌లో పోటీపడతాయి.
మలేషియా ఆతిథ్యమిచ్చిన 2016 ఆసియా క్రీడల ఫైనల్లో భారత జట్టు పాకిస్తాన్‌పై 3-2 గోల్స్ తేడాతో గెలిచి టైటిల్‌ను రెండోసారి ఎగరేసుకుపోయింది. ఇతర జట్లతో పోల్చిచూస్తే పటిష్టంగా ఉన్నప్పటికీ పెనాల్టీ కార్నర్లను గోల్‌గా మలచడంలో టీమిండియా కొంత వెను కబడి ఉన్న మాట వాస్తవమే. ప్రపంచకప్, ఆసియా క్రీడల హాకీలో పాల్గొనేందుకు బయల్దేరే ముందు భువనేశ్వర్‌లో జరిగిన శిక్షణా శిబిరంలో ఆటగాళ్ళు కఠోర ప్రాక్టీస్ చేశారు.
ఇప్పటివరకూ భారత్, పాకిస్తాన్ జట్లు రెండే సిసార్లు ఆసియాకప్ టైటిళ్ళను గెలిచాయి. ప్రస్తుతం జరిగే ఐదో టైటిల్‌ను ఇరుజట్లలో ఏ జట్టు గెలిచినా రికార్డ్‌స్థాయిలో మూడోసారి గెలిచి నట్లవుతుంది. ఆసియా క్రీడల హాకీ స్వర్ణపతక విజేత మలేషియాకు ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 12వ స్థానం దక్కగా.. ఆ జట్టు తొలి మ్యాచ్‌ను జపాన్‌తో తలపడనుంది. జకార్తాలో జరిగిన 18వ ఆసియా క్రీడల్లో సెమీస్‌లో అనూహ్యంగా మలేషియా చేతిలో ఓడి కాంస్యానికే పరిమితమె ౖన సంగతి తెలిసిందే. దీంతో నేటినుంచి ప్రారంభ మయ్యే ఆసియాకప్ హాకీ టోర్నీకి ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రస్తుతం భారత్ టైటిల్ చేజి క్కించుకోవడమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది.
షెడ్యూల్...
అక్టోబర్ 18 : భారత్ × ఓమన్
అక్టోబర్ 20 : భారత్ × పాకిస్తాన్
అక్టోబర్ 21 : భారత్ × జపాన్
అక్టోబర్ 23 : భారత్ × మలేషియా
అక్టోబర్ 24 : భారత్ ×దక్షిణకొరియా