Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లండన్ : ఆల్ ఇంగ్లండ్ టెన్నిస్ గ్రాండ్‌స్లామ్(వింబుల్డన్) ఐదోసెట్ టైబ్రేక్‌లో మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఈ మేరకు వింబుల్డన్ ఛైర్మన్ ఫిలిప్ బ్రోక్స్ మాట్లాడుతూ వచ్చే ఏడాది(2019)నుంచి ఐదోసెట్ టైబ్రేక్‌ను 6-6 నుంచి 12-12కు పెంచనున్నట్లు శుక్రవారం తెలిపారు. ఇంతకుముందు ఐదోసెట్లో ఇరువురు ఆటగాళ్లు 6-6తో సమంగా ఉన్న అనంతరం సెట్ టైబ్రేకర్లు ఇచ్చేవారు. దీనికారణంగా 2010లో ఇస్నర్-నికోలస్ల జోడీ మూడురోజులపాటు మ్యాచ్‌ను ఆడుతూ వింబుల్డన్ చరిత్రలో తొలిసారి 11 గంటలకు పైగా మ్యాచ్ ఆడి రికార్డ్ సమయం కొనసాగించాల్సి వచ్చింది. ఆ మ్యాచ్‌లో ఇస్నర్ 70-68తో పాయింట్ల తేడాతో నికోలస్‌పై గెలుపొందాడు. దీంతో చాలాకాలంలో అమలులో ఉన్న నియమ నిబంధనలను సడలిస్తూ ఐదోసెట్ను 12-12 పాయింట్ల వరకు పొడిగిన అనంతరం ఆ తర్వాత టైబ్రేకర్లలోకి వెళ్లనున్నట్లు బ్రోక్స్ తెలిపారు.