Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 373 పరుగుల తేడాతో కంగారూల ఓటమి
- నాలుగోసారి అత్యధిక స్కోరుతో పాక్ గెలుపు
అబుదాబీ: ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో పాకిస్థాన్ క్రికెట్ 373 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో రెండు టెస్టుల సిరీస్‌లో 1..0 తేడాతో పాక్ గెలుపును సొంతం చేసుకున్నది. మొదటి టెస్టు డ్రాగా ముగిసింది. ఆస్ట్రేలియా జట్టును నాలుగేండ్ల తర్వాత పాక్ ఓడించింది. ఇంతకు ముందు 2014 అక్టోబర్ 30న అబుదాబిలో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను 356 పరుగుల తేడాతో పాక్ ఓడించింది. ఇక పరుగుల విషయంలో ఆస్ట్రేలియాను పాక్ జట్టు నాలుగోసారి అత్యధిక స్కోరుతో మట్టికరిపించింది.
రెండు ఇన్నింగుల్లోనూ పాక్ స్కోరులో సగానికి దాటని ఆస్ట్రేలియా పరుగులు
1.1981 డిసెంబర్ 11న ఆస్ట్రేలియాలోని మెల్బర్న్లో జరిగిన టెస్టు సీరిసిఞలో 82 పరుగులు,1982 సెప్టెంబర్ 30న ఫైసలాబాద్‌లో జరిగిన మ్యాచ్‌లో ఇన్నింగు మూడు పరుగులు,1988 సెప్టెంబర్ 15న ఇన్నింగు,188 పరుగుల తేడాతో వక్ గెలిచింది.
2.ఈ టెస్టులో పాక్ జట్టు టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేయాలని నిర్ణయించింది. మొదటి ఇన్నింగులో 282 పరుగులు చేసింది. రెండో ఇన్నింగులో తొమ్మిది వికెట్లు కోల్పోయి 400 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. బ్యాటింగ్ మొదలు పెట్టిన ఆస్ట్రేలియా జట్టు తొలి ఇన్నింగులో 145 పరుగులు, రెండో ఇన్నింగులో 164 పరుగులు మాత్రమే సాధించింది.
3.ఈ సిరీస్‌లో వక్ ఆటగాడు మొహమ్మద్ అబ్బాస్ అద్భుతంగా రాణించాడు. రెండో టెస్టులో 95 పరుగులిచ్చి ఆస్ట్రేలియాకు చెందిన 10 మంది ఆటగాళ్లను(తొలి ఇన్నింగ్‌లో ఐదుగురు,రెండో ఇన్నింగ్‌లోనూ మరో ఐదుగురు)అవుట్ చేశాడు.ఇది అతని అత్యుత్తమ ప్రదర్శన కావటం విశేషం.
4.అబ్బాస్‌ను ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్,ప్లేయర్ ఆఫ ద సిరీస్‌గా ప్రకటించారు. యూఏఈలో ఒక టెస్టులో పది వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా రికార్డు కెక్కాడు.
5.అబ్బాస్ కన్నా ముందు జునైద్ ఖాన్ అత్యధిక వికెట్లు పడగొట్టిన ఆటగాడుగా రికార్డు ఉన్నది.2013..14లో శ్రీలంకకు వ్యతిరేకంగా ఆడిన మ్యాచ్‌లో 151 పరుగులిచ్చి 8 వికెట్లు రాల్చాడు. అబ్బాస్ ఈ సిరీస్ కంటే ముందు జరిగిన టెస్టులో కూడా ఏడు వికెట్లు పడగొట్టాడు